చెన్నై: ప్రైమ్ వాలీబాల్ లీగ్ రెండో సీజన్ తొలి మ్యాచ్‌లో ఓటమి నుంచి హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ వెంటనే తేరుకుంది. సోమవారం జరిగిన తమ రెండో మ్యాచ్‌లో బ్లాక్‌హాక్స్ 3–2తో ముంబై మెటియోర్స్‌పై ఉత్కంఠ విజయంతో బోణీ చేసింది. ఐదు సెట్ల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ 7-–15, 12–-15, 15–-10, 15-–11, 20–-18తో ముంబైని ఓడించింది. తొలి రెండు సెట్లు కోల్పోయి ఓ దశలో 0–2తో వెనుకంజలో నిలిచిన హైదరాబాద్ తర్వాత సూపర్ పెర్ఫామెన్స్ చేసింది. చివరి మూడు సెట్లను గెలిచి మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. అష్మతుల్లా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు నెగ్గాడు.
