కరోనాతో స్పెయిన్ ప్రిన్సెస్ మృతి

కరోనాతో స్పెయిన్ ప్రిన్సెస్ మృతి

మహమ్మారి కరోనా రోజురోజుకు విలయతాండవం చేస్తుంది. రోజుకు వందలాది మందిని బలితీసుకుంటుంది. ఈ కరోనా వైరస్ కు  స్పెయిన్ ప్రిన్సెస్ మారియా థెరిసా కూడా బలయింది.  ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది. ఈ విషయాన్ని తన సోదరుడు ప్రిన్స్ ఎన్రిక్ డి బోర్బన్  చెప్పారు. ప్రపంచంలోనే ఒక రాయల్ ఫ్యామిలీ నుంచి నమోదైన తొలి కరోనా కేసు ఇది.

సోషియాలజీ ప్రొఫెసర్‌గా పనిచేసిన 86 ఏళ్ల మారియా స్పెయిన్ రాజు ఫెలిప్-6కు  సోదరి. 1933 జూలై 28న జన్మించిన మారియా ఫ్రాన్స్‌లో చదువుకున్నారు. మారియా సోషల్ ఆక్టివిటీస్ లో ఎక్కువగా పాల్గొనేవారు.  సామాజిక కార్యక్రమాలతో రెడ్ ప్రిన్సెస్‌గా  మారియా పేరు తెచ్చుకున్నారు.  ఇక స్పెయిన్ లో 73,235 పాజిటివ్ కేసులు నమోదవ్వగా  5,982 మంది చనిపోయారు.  ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 30 వేలు దాటింది.