కూకట్పల్లి, వెలుగు: కాలేజీ హాస్టల్కు సెల్ఫోన్ తెచ్చిన ఓ విద్యార్థిని ప్రిన్సిపాల్ చిదకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్‌కు చెందిన కె.తిరుపతి కొడుకు కేపీహెచ్‌బీ సాయినగర్‌లోని శ్రీవశిష్ట జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతూ వారి హాస్టల్లోనే ఉంటున్నాడు.
నవంబర్ 30న కాలేజీ ప్రిన్సిపాల్ హాస్టల్లో చెకింగ్ చేస్తుండగా అతడి వద్ద మొబైల్ ఫోన్ దొరికింది. దీంతో ప్రిన్సిపాల్ సదరు స్టూడెంట్ను కర్రతో చితకబాదడంతో వీపుపై వాతలు పడ్డాయి. విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో బుధవారం కేపీహెచ్‌బీ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంతకుముందు కాలేజీ యాజమాన్యంతో గొడవకు దిగారు.
