ప్రింట్ మీడియాకు మంచి రోజులు

ప్రింట్ మీడియాకు మంచి రోజులు

న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వార్తాపత్రికలకు మంచి రోజులు వస్తాయని తాజా స్టడీ రిపోర్టు వెల్లడించింది. కాకపోతే,  రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం, న్యూస్​ప్రింట్​ ధరల ఫలితంగా వీటి ఇబిటా మార్జిన్‌‌‌‌‌‌‌‌ దాదాపు 300 బేసిస్​ పాయింట్లు తగ్గవచ్చని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ పేర్కొంది.  ప్రకటనల రాబడిలో బలమైన పెరుగుదల కారణంగా ఆదాయం సంవత్సరానికి 20–-25 శాతం పెరగవచ్చు.  లోయర్ బేస్ ఉన్నప్పటికీ పరిశ్రమ ఆదాయం కోవిడ్- ముందుస్థాయుల కంటే తక్కువగానే ఉంటుంది.2021ఫైనాన్షియల్ ఇయర్ లో  ఇండస్ట్రీ వాడిన న్యూస్​ప్రింట్​లో 60 శాతాన్ని దిగుమతి చేసుకుంది. మొత్తం దిగుమతుల్లో రష్యా నుండి 38 శాతం, కెనడా నుంచి 26 శాతం ఉన్నాయి. 2020, 2021 ఫైనాన్షియల్ ఇయర్లలో న్యూస్ ప్రింట్ ధరలు తగ్గినప్పటికీ, యుద్ధం కారణంగా పోయిన కొన్ని నెలలుగా ధరలు చాలా పెరిగాయి. 2022 లో దిగుమతి చేసుకున్న న్యూస్‌‌‌‌‌‌‌‌ప్రింట్ ధర 80 శాతం పెరిగింది. ఇక నుంచి దిగుమతులు రాకపోతే, రాబోయే మూడు నుండి ఆరు నెలల్లో ధరలు ఇంకా పెరుగుతాయి. అయితే,  లోకల్​ సరఫరాలు పెరిగి  ధరలు అదుపులోకి  వచ్చే అవకాశం ఉంటుంది.  

తగ్గిన దిగుమతి
గడిచిన పది నెలల్లో .. అంటే యుద్ధానికి ముందు మొత్తం న్యూస్‌‌‌‌‌‌‌‌ప్రింట్‌‌‌‌‌‌‌‌లో దిగుమతి వాటా 52 శాతంగా ఉంది. గడచిన 10 సంవత్సరాలలో ఇదే అతితక్కువ. 2021 ఫైనాన్షియల్ ఇయర్ సమయంలో, కొవిడ్-19  తర్వాత సర్క్యులేషన్  పడిపోవడం,  పేజీల తగ్గింపు  కారణంగా న్యూస్‌‌‌‌‌‌‌‌ప్రింట్ అవసరం దాదాపు 48 శాతం తగ్గి 1.1 మిలియన్ టన్నులకు పడిపోయింది.2021 ఫైనాన్షియల్ ఇయర్ కంటే  22 ఫైనాన్షియల్ ఇయర్లో న్యూస్‌‌‌‌‌‌‌‌ప్రింట్ వినియోగం కొద్దిగా పెరిగింది. ఎక్కువ సర్క్యులేషన్, ఎక్కువ అడ్వర్టైజ్‌‌‌‌‌‌‌‌మెంట్ కారణంగా 2023 ఫైనాన్షియల్ ఇయర్లో న్యూస్​ప్రింట్​ వినియోగం​ పెరుగుతుంది. అయితే ఇది 2020 స్థాయిలో ఇది ఉండకపోవచ్చని ఇండ్​రా రీసెర్చ్​ సీనియర్ ఎగ్జిక్యూటివ్​ ఒకరు చెప్పారు.