
మల్కాజిగిరి, వెలుగు: శాంతి భద్రతల పరిరక్షణలో టెక్నాలజీ వాడకంతో పాటు విజిబుల్ పోలీసింగ్ కు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తామని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలో ‘ విజిబుల్ పోలీసింగ్, సత్వర స్పందన, టెక్నాలజీ వాడకం’ వంటి మూడింటికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రతి ఏరియాలోనూ బ్లూ కోల్ట్స్, పెట్రోకార్, సైకిల్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ట్లు వివరించారు. నేరెడ్ మెట్ లోని రాచకొండ కమిషనరేట్లో ఆయన సోమవారం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కమిషరేట్ పరిధిలో విజిబుల్పోలీసింగ్పనితీరుపై వెల్లడించారు.
సైకిళ్లపై పెట్రోలింగ్
పోలీసులపై నమ్మకం పెంచేందుకు డయల్100 , 112 ద్వారా వచ్చే కంప్లయింట్లపై బ్లూకోల్ట్స్, పెట్రో కార్ సిబ్బంది వేగంగా స్పందిస్తున్నారని స్పష్టంచేశారు. బాధితుల వద్దకు వీలైనంత తక్కువ సమయంలో త్వరగా చేరుకునేలా పని చేస్తున్నామని తెలిపారు. ప్రతి పోలీసు స్టేషన్ కు 3-5 సైకిళ్లను పంపిణీ చేశామని, శాంతి భద్రతల పర్యవేక్షణకు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.