రూల్స్ ప్రకారమే ప్రయారిటీ సర్వీస్.. డాట్కు ఎయిర్టెల్ వివరణ

రూల్స్ ప్రకారమే  ప్రయారిటీ సర్వీస్.. డాట్కు ఎయిర్టెల్ వివరణ

న్యూఢిల్లీ: రద్దీ సమయాల్లోనూ పోస్ట్​ పెయిడ్​ కస్టమర్లకు నాణ్యమైన నెట్​వర్క్​అందించడానికి తీసుకొచ్చిన ప్రయారిటీ  సర్వీస్‌‌‌‌‌‌‌‌  నెట్ న్యూట్రాలిటీ నిబంధనలకు వ్యతిరేకం కాదని  ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్.. టెలి కమ్యూనికేషన్ల శాఖ (డాట్) కమిటీకి తెలిపింది. 

దీనివల్ల ప్రిపెయిడ్ కస్టమర్లకు ఇబ్బందులు రావని స్పష్టం చేసింది. ఈ సర్వీసు​ ట్రాయ్, డాట్​ ఫ్రేమ్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌ ప్రకారమే ఉంటుందని పేర్కొంది. పోస్ట్​ పెయిడ్​ కస్టమర్లకు ప్రత్యేక సదుపాయాలు ఇవ్వబోమని తెలిపింది.