రాష్ట్రంలోని 24 జైళ్ల వద్ద ఉన్న పెట్రోల్ బంకుల్లో ఖైదీలే వర్కర్లు

రాష్ట్రంలోని 24 జైళ్ల వద్ద ఉన్న పెట్రోల్ బంకుల్లో ఖైదీలే వర్కర్లు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు:వాళ్లంతా ఖైదీలు. తెలిసి నేరాలు చేసినవారు కొందరైతే క్షణికావేశంలో  చేసిన వారు మరికొందరు.  నేరం నిరూపణ కావడంతో కోర్టులు జైలు శిక్షలు విధించాయి. ఏడాది నుంచి జీవిత కాలం జైలు శిక్షలు అనుభవిస్తూ జైళ్లలో మగ్గుతున్నారు. ఇలాంటి వారికి రాష్ట్ర జైళ్లశాఖ ఉపాధి చూపించింది. రాష్ట్ర వ్యాప్తంగా 24 పెట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బంకులు ఏర్పాటు చేసి బతుకుదెరువు చూపింది. ఇందులో చంచల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గూడ సెంట్రల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహించే పెట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆదాయంలో టాప్ లో నిలిచింది. ఏటా రూ.128 కోట్ల నుంచి రూ.140 కోట్ల టర్నోవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధిస్తోందని జైలు అధికారులు చెప్తున్నారు.

2013లో మొదటిసారిగా..
 జైళ్ల శాఖ మాజీ  డీజీ వీకే సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో 2013లో చంచల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గూడలో  మొదటిసారిగా పెట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభించారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 17 బంకులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వాటి సంఖ్య 24 కు చేరింది. జైళ్లలో శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలు,శిక్ష పూర్తి చేసుకుని విడుదలైన వారు మళ్లీ నేరాల బాట పట్టకుండా ఈ పెట్రోల్ బంకుల్లో జీవనోపాధిని కల్పిస్తున్నారు. జైలులో ఉంటూ బంకుల్లో పనిచేసే ఖైదీలకు రోజు రూ.150తో పాటు రూ.20 టిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఇస్తున్నారు. శిక్షలు అనభవించి రిలీజై ఇక్కడి బంకుల్లో పనిచేస్తున్న వారికి నెలకు రూ.16,500 జీతం ఇస్తున్నారు. జీతం డబ్బులు ప్రతి నెల వారి అకౌంట్లలో జైళ్ల శాఖ డిపాజిట్ చేస్తోందని అధికారులు తెలిపారు.

రోజూ రూ.40 లక్షల పెట్రోల్, డీజిల్ అమ్మకాలు
చంచల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గూడ జైలు వద్ద ఉన్న పెట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బంకులో మొత్తం 62 మంది పనిచేస్తున్నారు. ఇందులో 58 మంది  ఖైదీలు ఉన్నారు. ప్రతి షిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 18 మంది ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్యూటీలో ఉంటారు. వీరిని జైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు ముగ్గురు సిబ్బంది మానిటరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తుంటారు. ఇక్కడి బంకులో పోసే పెట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వాలిటీ,క్వాంటిటీకి మంచి పేరు ఉండడంతో  రోజూ వాహనదారులు క్యూ కడుతుంటారు. 
ఈ క్రమంలో ఒక్కో రోజు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షలు పెట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డీజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమ్మకాలు జరుగుతుంటాయని అధికారులు చెప్తున్నారు. ఈ ఏడాది జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 17న అత్యధికంగా రూ.63 లక్షల పెట్రోల్, డీజిల్ అమ్మకాలు జరిగాయన్నారు. ఇలా గతేడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ఈ ఏడాది మార్చి వరకు  రూ.123 కోట్ల80 లక్షల పెట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,డీజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను అమ్మామన్నారు. ఇందులో రూ.2.66 కోట్ల ఆదాయం జైళ్ల శాఖకు వచ్చిందన్నారు.

జీతం ఇంటికి పంపుతున్న 
మాది మేడ్చల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా మనోహరాబాద్. మర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసులో 2015 నుంచి చంచల్ గూడ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నా. ఇక్కడి పెట్రోల్ బంకులో డ్యూటీ చేయగా వచ్చిన జీతాన్ని ఇంటికి పంపిస్తున్నా.    - గణేశ్, జీవిత ఖైదు

మార్పు కోసమే.. ఖైదీలో పరివర్తన కోసం 
మా డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగా చంచల్ గూడ జైలు వద్ద పెట్రోల్ బంకును ఏర్పాటు చేసింది.  ప్రతి రోజు సుమారు రూ.50 లక్షల వరకు కౌంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంటుంది. రాష్ట్రంలోని జైళ్ల వద్ద అన్ని పెట్రోల్ బంకుల కంటే ఇక్కడే ఎక్కువ ఆమ్దానీ వస్తుంది. ఖైదీలకు ఉపాధి వారి కుటుంబాలకు భరోసా ఇవ్వాలన్నదే జైళ్ల శాఖ లక్ష్యం. - సుభాష్, జైలర్, చంచల్ గూడ