హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర జైళ్లలోని ఖైదీల వేతనాల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని జైళ్ల శాఖ డీజీ సౌమ్యమిశ్రా వెల్లడించారు. మెరుగైన సమాజం కోసం ఖైదీలు మహాత్మా గాంధీ మార్గాన్ని అనుసరించాలని సూచించారు. గాంధీ జయంతి సందర్భంగా బుధవారం చంచల్‌గూడ సెంట్రల్ జైలులో ఖైదీల సంక్షేమ దినోత్సవం నిర్వహించారు.
డీజీ సౌమ్యమిశ్రాతోపాటు హైకోర్టు జడ్జి సుజ్‌పాల్, జైలు సూపరింటెండెంట్ శివకుమార్ గౌడ్ పాల్గొన్నారు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని సౌమ్య మిశ్రా తెలిపారు.