సలార్ విలన్ కు ప్రమాదం.. ఆగిపోయిన షూటింగ్స్

సలార్ విలన్ కు ప్రమాదం.. ఆగిపోయిన షూటింగ్స్

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) కు ప్రమాదం జరిగిందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలో వస్తున్న విలయత్ బుద్ద(Vilayath bidda) అనే సినిమా షూటింగ్ సమయంలోప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఆయన కాలికి దెబ్బ తగలగా..  వెంటనే హాస్పిటల్ కు తరలించారట చిత్ర యూనిట్. 

వైద్యపరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. మైనర్ ఆపరేషన్ చేయాలని సూచించారట. ఈ ఆపరేషన్ తరువాత పృథ్వీరాజ్ దాదాపు రెండు, మూడు నెలలు రెస్ట్ లో ఉండనున్నాడు. ఇక ఈ విషయం తెలియడంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరో వెంటనే కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు. 

ఇక పృధ్వీరాజ్ సుకుమారన్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న సలార్(Salaar) సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.