సీక్రెట్‌‌‌‌ కెమెరాతో మహిళల వీడియోలు రికార్డు.. పైలట్‌‌‌‌ అరెస్ట్‌‌‌‌

సీక్రెట్‌‌‌‌ కెమెరాతో మహిళల వీడియోలు రికార్డు.. పైలట్‌‌‌‌ అరెస్ట్‌‌‌‌
  • ఢిల్లీలోని శని బజార్‌‌‌‌‌‌‌‌లో ఘటన

న్యూఢిల్లీ: సీక్రెట్‌‌‌‌ కెమెరాలతో మహిళల వీడియోలు తీస్తున్న ఓ ప్రైవేట్‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌ లైన్స్‌‌‌‌ పైలట్‌‌‌‌ను పోలీసులు అరెస్ట్‌‌‌‌ చేశారు. ఢిల్లీలోని కిషన్‌‌‌‌గఢ్‌‌‌‌లోని శని బజార్‌‌‌‌‌‌‌‌లో ఓ వ్యక్తి సీక్రెట్‌‌‌‌ కెమెరాతో మహిళలను అసభ్యకరంగా రికార్డు చేస్తున్నాడు. ఈ విషయాన్ని గమనించిన ఓ మహిళా.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. విషయం తెలుసుకున్న నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో సీసీటీవీ కెమెరాలు, స్థానిక ఇంటెలిజెన్స్‌‌‌‌, సీక్రెట్‌‌‌‌ ఇన్‌‌‌‌ఫార్మర్స్‌‌‌‌ సహాయంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్‌‌‌‌ చేశారు. 

అతని నుంచి లైటర్‌‌‌‌‌‌‌‌ ఆకారంలో ఉన్న సీక్రెట్‌‌‌‌ కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని 31 ఏండ్ల ప్రియదర్శిగా గుర్తించారు. ఇతను ఓ ప్రైవేట్‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌ లైన్స్‌‌‌‌లో పైలట్‌‌‌‌గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడు పలు బహిరంగ ప్రదేశాల్లో మహిళల వీడియోలను రికార్డు చేస్తున్నట్లు గుర్తించారు.