దీపావళి వరకు ప్రైవేటు కాలేజీల బంద్ వాయిదా..పండుగలోపు రూ.300 కోట్లు ఇస్తామని సర్కార్ హామీ

దీపావళి వరకు ప్రైవేటు కాలేజీల బంద్ వాయిదా..పండుగలోపు రూ.300 కోట్లు ఇస్తామని సర్కార్ హామీ

హైదరాబాద్, వెలుగు: ప్రైవేటు కాలేజీల మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ల సమ్మె, కాలేజీల బంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వాయిదా వేస్తున్నట్టు ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విద్యా సంస్థల మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ల సంఘం (ఫతీ) ప్రకటించింది. ఈ నెల13 నుంచి 23(దీపావళి మరుసటి రోజు) వరకు ఈ వాయిదా కొనసాగనుందని తెలిపింది. వివిధ విద్యా సంస్థలకు సంబంధించి స్కాలర్ షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ బకాయిలపై సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో ఫతీ చైర్మన్ రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాబు, సెక్రటరీ జనరల్ రవి కుమార్, ట్రెజరర్ కృష్ణారావుతో పాటు కోర్ కమిటీ సభ్యులు తదితరులు తాజాగా సమావేశమయ్యారు. 

దసరా ముందు రోజు రూ.200 కోట్లు బకాయిలు చెల్లించినప్పటికీ, సుమారు 70 మైనారిటీ, జనరల్ కాలేజీలకు ఒక్క రూపాయి రిలీజ్ కాలేదని చెప్పారు. దీనిపై స్పందించిన వేం నరేందర్ రెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి దీపావళిలోపు రూ.300 కోట్లు రిలీజ్ చేయిస్తామని వారికి హామీనిచ్చారు. అప్పటిలోపు సమ్మె వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సీఎం సలహాదారు విజ్ఞప్తి మేరకు ఈ నెల 23 వరకు సమ్మెను వాయిదా వేయాలని తీర్మానించినట్టు సంఘం నేతలు వెల్లడించారు.