కార్పొరేట్ హాస్పిటళ్లు కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చనీయట్లే..

కార్పొరేట్ హాస్పిటళ్లు కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చనీయట్లే..
  • కార్పొరేట్ హాస్పిటళ్ల ఒత్తి డి.. వాటికే సర్కారు సపోర్ట్
  • కరోనా ట్రీట్మెంట్ కు అందినంత దోచుకుంటున్న ఆస్పత్రులు
  • సర్కారు చార్జీలకు ట్రీట్మెంట్చేయలేమంటూ జీవోనే  మార్పించుకున్నయ్
  • హెల్త్ ఇన్సూరెన్స్కూ ఆ రేట్లు వర్తించకుండా ఒత్తిళ్లు
  • ఏపీలో మాదిరిగా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలంటున్న పేదలు
హైదరాబాద్, వెలుగు: కరోనా ట్రీట్మెంట్కు లక్షలకు లక్షలు ఖర్చు చేయలేక జనం గగ్గోలు పెడుతున్నా సర్కారు మాత్రం ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిట ల్స్ కు  అను కూలంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం నిరయించిన చార్జీలకు కరోనా ట్రీట్మెంట్ చేయలేమంటూ మొండికేసిన ప్రైవేట్ హాస్పిటల్స్ చివరికిజీవోనే మార్చేలా చేశాయి. కరోనా ట్రీట్మెంట్ చార్జీలు హెల్త్ఇన్స్యూరెన్స్కు వర్తించకుండా చేయడంలోనూ సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు కరోనా ట్రీట్మెంట్ను ఆరోగ్యశ్రీలో చేర్చకుండా అడ్డుపడుతున్నాయి. ఏపీలో ఆరోగ్యశ్రీ కింద కరోనా ట్రీట్ మెంట్ ఇస్తుండటంతో..ఇ క్క డ కూడా అలాగే అమలు చేయాలన్న డిమాండ్ పెరిగింది. కానీ కార్పొరేటు హాస్పిటళ్ల సిండికేట్ వెంటనే రంగంలోకి దిగి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. అందువల్లే కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చడంలో సర్కారువెనక్కితగ్గిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అడ్డగోలు వసూళ్లకు చాన్స్ ఉండదనే.
కార్పొరేట్ హాస్పిటళ్లుకరోనా ట్రీట్మెంట్కు రూ.10 లక్షల దాకా బిల్లులు వేస్తున్నాయి. ఆరోగ్యశ్రీలో చేర్చితే ఇలా ,లక్షల్లో వసూలు చేసుకునే చాన్స్ పోతుందన్న ఉద్దేశంతో ఉన్నాయని, అందుకే అడ్డు చెప్తున్నాయని హెల్త్ డిపారర్ట్ మెంట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆరోగ్యశ్రీ పరిధిలో కరోనా ట్రీట్మెంట్చేస్తేవెంటనే బిల్లు లు రావు, సర్కారు ఎప్పుడు నిధులిస్తుందో తెలియదు, పెద్ద ఎత్తున లాభాలు రావని హాస్పిటళ్ల మేనేజ్మెంట్లు భావిస్తున్నాయని అంటున్నాయి. సర్కారు కరోనా ట్రీట్ మెంట్ ను ఆరోగ్యశ్రీలో చేర్చకపోతే ఎక్కువ లాభాలు మూటగట్టుకొవచ్చని పావులు కదుపుతున్నాయి. ఏపీ సర్కారు ఆరోగ్యశ్రీ కింద కరోనా ట్రీట్ మెంట్కు రూ.16 వేల నుంచి రూ.2 లక్షల 60 వేల వరకు ఫీజు చెల్లిస్తామంటూ జీవో ఇచ్చింది. తెలంగాణలో ఆ మేరకు ఫీజులు నిర్ణయించినా  ట్రీట్మెంట్చేసేందుకు కార్పొరేట్ హాస్పిటళ్లురెడీగా లేవని ఓ సీనియర్ అధికారి తెలిపారు.

ప్రైవేటు దెబ్బకు జీవోనే మార్చేశారు!

ప్రైవేటు, కార్పొరేటు హాస్పిటళ్లలో  కరోనా ట్రీట్మెంట్ కు సర్కారు నిర్ణయించిన చార్జీలను మేనేజ్మెంట్లు గట్టిగా వ్యతిరేకించాయి. ఆ దెబ్బతో చార్జీలర్జీ కు సంబంధించిన జీవోనే మార్చేశారు. వాస్తవానికి ప్రైవేటు,  కార్పొరేట్హాస్పిటళ్లలో  ఐసోలేషన్ కు రోజుకు రూ.4వేలు, ఐసీయూలో ఉంటే రోజుకు రూ.7,500, వెంటిలేటర్ పెడితే రూ.9,000 చొప్పున చార్జీ వసూలుచేయాలంటూ జీవో జారీ చేసింది. ఈ చార్జీలు గిట్టుబాటు కావని.. రేట్లు పెంచాలని హాస్పిటళ్లప్రతినిధులు పలుమార్లుమంత్రి ఈటలతో సమావేశమై ఒత్తిడి చేశారు. అయితే పీపీఈ కిట్లు, ఇతర ప్రొసీజర్లపేరిట అదనపు చార్జీలు వసూలు చేసుకోవడానికి సర్కారు జీవోలోనే చాన్స్ ఇచ్చింది. ఆ లొసుగులను అడ్డుపెట్టుకుని హాస్పిటళ్లు అడ్డగోలు దోపిడీకి దిగాయి. మరోవైపు హెల్త్ఇన్సూరెన్స్ కంపెనీలు సర్కారు నిర్ధారించిన చార్జీలే  చెల్లిస్తామని ప్రకటించడంతో దానికీ కార్పొరేట్ హాస్పిటళ్లు ఒప్పుకోలేదు. హెల్త్ఇన్సూరెన్స్ ఉన్నపేషెంట్లకు కరోనా ట్రీట్మెంట్చేసేందుకు నిరాకరించాయి. సర్కారునిర్ధారించిన ఫీజులు హెల్త్ ఇన్సూరెన్స్ కు వర్తించకుండా చేయాలని, ఎక్కువ వసూలు చేసుకునే చాన్స్ ఉండాలని సర్కారు పెద్దలపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చాయి. చివరికి కరోనా ట్రీట్మెంట్ కు సర్కారు నిర్ధారించిన చార్జీలు హెల్త్ ఇన్సూరెన్స్ కింద వర్తించవని ఏకంగా జీవో ఇచ్చింది.కేవలం క్యాష్ పేమెంట్ ఎంచుకున్నవారికే వర్తిస్తుందని పేర్కొనడం గమనార్హం.
లక్షల్లో వసూలు చేసినా చర్యలెవ్వి?

కార్పొరేటు హాస్పిటళ్లు కరోనా ట్రీట్మెంట్ కోసం లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నా సర్కారు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. హెల్త్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన వాట్సప్ నంబరుకు వేల కొద్దీ ఫిర్యాదులు వస్తున్నాచర్యలు తీసుకోలేదు. ఒక్క కార్పొరేట్ హాస్పిటల్ పైనా చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. రూ.2,700తో చేయాల్సిన కరోనా టెస్టు కు రూ.3 వేలకుపైగా వసూలు చేస్తున్నారు. టెస్ట్ రిజల్ట్‌‌ రావడానికి 24 గంటల  చి 48 గంటలు పడుతుందని.. ముందుగా సీటీ స్కాన్ చేయించాలంటున్నారు. రూ.2 లక్షల అడ్వాన్స్ చెల్లిస్తేనే పేషెంట్ను అడ్మిట్ చేసుకుంటున్నారు. రోజుకు రూ.60 వేల నుంచి రూ. 70 వేల వరకు చార్జి చేస్తున్నారు. డిశ్చార్జి అయ్యే నాటికి 10 లక్షల దాకా వసూలు చేస్తున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులున్న పేషెంట్లను చేర్చుకోవడం లేదు. క్యాష్ పేమెంట్ చేయాలన్న కండిషన్ పెట్టి హాస్పిటల్లోకి రానిస్తున్నారు.
ఆరోగ్యశ్రీలో చేర్చితే ఆటలు చెల్లవనే..
కరోనా ట్రీట్మెంట్ను ఆరోగ్యశ్రీలో చేర్చితే కార్పొరేటు హాస్పిటళ్లు ఇష్టమొచ్చినట్టు వ్యవహరించడం కుదరదు. ఆరోగ్యశ్రీ కింద చితంగా ట్రీట్ మెంట్ ఇవ్వాలి. పేషెంట్ ను చేర్చుకోకుంటే బంధువులు ఆందోళన చేస్తారు. అడ్డగోలుగా డబ్బులు వసూలు చేయడానికి చాన్స్ ఉండదు. ఒకవేళ ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే ఇబ్బందులు తప్పవు. గతంలో అధిక చార్జీలు వసూలు చేయడంపై దాదాపు అన్ని కార్పొరేటు హాస్పిటళ్లకు చేదు అనుభవాలు ఉన్నాయి. దీంతో కరోనా ట్రీట్ మెంట్ ను ఆరోగ్యశ్రీలో చేర్చవద్దంటూ సర్కారు పెద్దల వద్ద గట్టిగా లాబీయింగ్ చేస్తున్నట్టు తెలిసింది.