Manchu Brothers: 'మిరాయ్'తో మ్యాజిక్! ఒకే ట్వీట్.. అదే ప్రేమ.. మంచు ఫ్యామిలీ మళ్లీ ఒక్కటైందా?

Manchu Brothers: 'మిరాయ్'తో  మ్యాజిక్! ఒకే ట్వీట్.. అదే ప్రేమ.. మంచు ఫ్యామిలీ మళ్లీ ఒక్కటైందా?

గత డిసెంబర్‌లో మంచు ఫ్యామిలీలో చోటు చేసుకున్న అంతర్గత విభేదాలు వార్తల్లో నిలిచాయి. అన్నదమ్ముల మధ్య ఆస్తుల పంపకాలు, వ్యక్తిగత అభిప్రాయ భేదాలే ఈ సమస్యకు ప్రధాన కారణమని బహింరంగంగానే చర్చకు దారితీసింది. ఈ కుటుంబంలో నెలకొన్న విభేదాలపై సినీ ఇండస్ట్రీతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక సోషల్ మీడియాలో అయితే చెప్పాల్సిన పనిలేదు. మంచు కుటుంబం రెండుగా వీడిపోయి రచ్చ చేస్తున్నారంటూ పెద్ద దుమారం సృష్టించారు నెటిజన్లు. ఒకానొక దశలో మనోజ్ తన తండ్రి మోహన్ బాబు, అన్న విష్ణుపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. 

సంబరాల్లో మనోజ్.. 

అయితే ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయినట్లు కన్పిస్తోంది.  దీనికి కారణం తేజ సజ్జా, మంచు మనోజ్ నటించిన ' మిరాయ్ ' మూవీ. ఈ చిత్రం ప్రపంచ వ్యా్ప్తంగా సెప్టెంబర్ 12న విడుదలైంది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో మంచు మనోజ్ సంబరాల్లో మునిగిపోయారు. తన ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి కేట్ కట్ చేశారు. ఇలాంటి గొప్ప విజయాన్ని అందించిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. తన తల్లి ఎంతో గర్వపడుతున్నారంటూ ఆశీర్వాదం తీసుకున్నారు. 

 

అన్నదమ్ముల మధ్య చిట్ చాట్.. 

ఈ సినిమా విడుదల సందర్భంగా మంచు మనోజ్ కూడా ఒక ట్విట్ చేశారు.   “మిరాయ్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్, గాడ్‌స్పీడ్” అని పోస్ట్ చేశారు. సాధారణంగా కనిపించే ఈ విషెస్‌ పోస్ట్‌కు మంచు మనోజ్ స్పందిస్తూ, "థాంక్యూ సో మచ్ అన్న, టీమ్ మిరాయ్, అలియాస్ బ్లాక్‌స్వోర్డ్" అని రీట్వీట్ చేశారు.  ఇటీవల మంచు విష్ణ నటించిన 'కన్నప్ప' విడుదల సందర్భంగా మనోజ్ అభినందనలు తెలిపారు. సినిమా సూపర్ డూపర్ అంటూ ప్రశంసించారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ ఇద్దరి ఈ చిన్న సంభాషణ సోషల్ మీడియాలో పెద్ద సంచలనంగా మారింది. చాలామంది నెటిజన్లు ఈ పోస్ట్‌ను చూసి, అన్నదమ్ములు మళ్ళీ కలిశారేమోనని చర్చించుకుంటున్నారు. 

 

అయితే, ఈ విభేదాలు పూర్తిగా సమసిపోయాయా లేదా అనేది ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. కానీ, మంచు విష్ణు, మనోజ్ మధ్య జరిగిన ఈ ట్వీట్ల మార్పిడి, ఇద్దరూ సాధారణంగా పలకరించుకోవడం చూస్తుంటే, వారి మధ్య సయోధ్య కుదిరిందేమోనని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  మంచు మనోజ్, తేజ సజ్జా కలిసి నటించిన 'మిరాయ్' చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది. ఒక విలక్షణమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తోందో చూడాలి మరి..