మంత్రి చెప్పినా తీరు మార్చుకోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు

మంత్రి చెప్పినా తీరు మార్చుకోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు
  • బ్యాంక్ గ్యారంటీ కోరిన మెడికల్​ కాలేజీలు
  • మంత్రి ఈటల ఫోన్​తో సద్దుమణిగిన వివాదం

హైదరాబాద్‌‌, వెలుగు: మూడేండ్ల పీజీ మెడికల్ కోర్సుకు స్టూడెంట్స్ నుంచి బ్యాంకు గ్యారంటీ అడగొద్దని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ ఆదేశించినా ప్రైవేటు మెడికల్ కాలేజీల మేనేజ్‌ మెంట్లు పట్టించుకోలేదు. మంత్రి ఆదేశాలను పెడచెవిన పెట్టి బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని స్టూడెంట్లను కోరాయి . దీంతో బుధవారం జూనియర్‌ డాక్టర్స్‌ (జూడా) అసోసియేషన్‌‌ ప్రతినిధులు మరోసారి మంత్రిని కలిసి విషయం వివరించారు. వెంటనే స్పందించిన ఈటల ప్రైవేటు మెడికల్‌‌ కాలేజీల అసోసియేషన్‌‌ ప్రెసిడెంట్ చెల్మెడ లక్ష్మీనారాయణతో మాట్లాడారు. దీంతో బ్యాంక్‌ గ్యారంటీ అడగబోమని నారాయణ మంత్రికి చెప్పా రని జూడాలు వెల్లడిం చారు. ఇక పీజీ మెడికల్‌‌ సీట్ల కేటాయింపులో ప్రైవేటు మెడికల్‌‌ కాలేజీలు అక్రమాలకు పాల్పడకుండా చూడాలని కాళోజీ వర్సిటీ వీసీ కరుణాకర్‌ రెడ్డికి హెల్త్‌‌ రిఫార్మ్స్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌‌ ప్రతినిధులు మంత్రికి వినతి పత్రం అందజేశారు.