
- కలెక్టర్‌కు రిపోర్ట్ ఇస్తానన్న సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్
- మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ఆకస్మిక తనిఖీ
మిర్యాలగూడ, వెలుగు: మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్‌ను సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎటువంటి పర్మిషన్ లేకుండా 8 మంది డాక్టర్లు డ్యూటీకి డుమ్మా కొట్టినట్లు గుర్తించారు. ఉదయం 11 గంటలకు వచ్చిన ఆయన 45 నిమిషాల పాటు దవాఖానలోనే ఉన్నారు. అన్ని వార్డులకు వెళ్లి, పేషంట్లతో మాట్లాడి, వైద్య సేవలపై ఆరా తీశారు.
డ్యూటీకి రాని జనరల్ ఫిజీషియన్లు భానుప్రసాద్, ప్రసూన, పల్మనాలజిస్ట్ రోహిత్, అనస్థీషియా డాక్టర్సంతోష్ కుమార్, గైనకాలజిస్ట్ స్పందన, సైక్రియాటిస్ట్ లు విజయ్ కుమార్, వీరజ, ఆప్తమాలజిస్ట్ ప్రజ్ఞారెడ్డిలపై కలెక్టర్ కు రిపోర్ట్ఇస్తానని తెలిపారు. రానున్న రోజుల్లో హాస్పిటల్‌లో బయోమెట్రిక్ సిస్టం అమలు చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.