మోడీ అమరావతి పర్యటనకు హై సెక్యూరిటీ.. డ్రోన్స్ కి నో పర్మిషన్..

మోడీ అమరావతి పర్యటనకు హై సెక్యూరిటీ.. డ్రోన్స్ కి నో పర్మిషన్..

ఏపీ రాజధాని అమరావతి పునః ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ అమరావతికి రానున్న సంగతి తెలిసిందే.. ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా అమరావతిలో కట్టదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇటీవల జమ్మూ కాశ్మీర్ లో జరిగిన పహల్గాం ఉగ్రదాడి కారణంగా భద్రతా మరింత కట్టుదిట్టం చేసినట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీ సభ జరిగే ప్రాంతంతో పాటు గన్నవరం ఎయిర్ పోర్టు పరిధిలోని 5 కిలోమీటర్ల మేర నో ఫ్లైయింగ్ జోన్ గా ప్రకటించారు అధికారులు.

ప్రధాని మోడీ పర్యటన ముగిసేవరకు కఠిన నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపారు అధికారులు. నో ఫ్లైయింగ్ జోన్ పరిధిలో బెలూన్లు, డ్రోన్లు ఎగరేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అధికారులు. సభాప్రాంగణంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచి సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు అధికారులు.

ప్రధాని మోడీ సభకు లక్షలాది మంది ప్రజలు హాజరు కానున్న క్రమంలో ఎక్కడా అసౌకర్యం తలెత్తకుండా చర్యలు చేపట్టారు అధికారులు.200 మంది తహసీల్దారులు, 100 మంది ఆర్దీఓలకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు అధికారులు. అత్యవరస వైద్యం కోసం తాత్కాలిక ఆసుపత్రులు, వైద్య బృందాలు, అంబులెన్సులు సిద్ధం చేసినట్లు తెలిపారు అధికారులు.