సినిమా క్లైమాక్స్ సీన్ తరహాలో : భార్యాభర్తలు ఒకరినొకరు కత్తులతో పొడుచుకుని చనిపోయారు..!

సినిమా క్లైమాక్స్ సీన్ తరహాలో : భార్యాభర్తలు ఒకరినొకరు కత్తులతో పొడుచుకుని చనిపోయారు..!

వాళ్లిద్దరూ భార్యాభర్తలు.. బాగా చదువుకున్నారు. వైద్య రంగంలో పని చేస్తున్నారు.. అది కూడా విదేశాల్లో.. దుబాయ్ లో ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్లే.. ఈ భార్యాభర్తలు ఇద్దరూ.. ఒకరినొకరు కత్తులతో పొడుచుకుని మరీ చనిపోయారు.. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. కేరళ రాష్ట్రానికి చెందిన ఈ దంపతులు.. దుబాయ్ లో ఈ దారుణానికి పాల్పడ్డారు. పోలీసులు స్పాట్ కు వచ్చిన చూడగా.. ఇద్దరు చనిపోయి నేలపై పడిఉన్నారు.. ఇద్దరి చేతుల్లో కత్తులు ఉన్నాయి.. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే.. 

కేరళలోని కన్నూర్‌కు చెందిన సూరజ్, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని జాబీర్ ఆసుపత్రిలో నర్సుగా, అతని భార్య బిన్సీ, రక్షణ మంత్రిత్వ శాఖలో నర్సుగా పని చేస్తున్నారు. వీరి పిల్లలు కున్నూర్ లోని ఇంట్లోనే ఉంటున్నారు. వారు తమ పిల్లలను ఇంటికి తీసుకువచ్చిన తర్వాత మరుసటి రోజు కువైట్ చేరుకున్నారు.

దంపతులు ఇద్దరు నైట్ డ్యూటీ ముగించుకొని ఇంటికి రాగానే ఘటన జరిగినట్లు తెలుస్తోంది..తెల్లవారుజామున సూరజ్, ఆరోగ్యలు గొడవపడినట్లు వినిపించిందని ఇరుగు పొరుగు ఫ్లాట్స్ లో ఉంటున్నవారు చెప్పారు. ఫ్లాట్‌లోని సెక్యూరిటీ గార్డు వచ్చేసరికి దంపతులు ఇద్దరూ రక్తపు మడుగులో చనిపోయి ఉన్నట్లు తెలుస్తోంది. వారి చేతుల్లో కత్తులు ఉన్నట్లు తెలిపారు సెక్యూరిటీ గార్డు తెలిపాడు. ఘటనాస్థలికి చెరుకున్న ఫోరెన్సిక్ బృందం ఆధారాలు సేకరించారు. ఇద్దరూ ఒకరినొకరు పొడిచుకున్నారని భావిస్తున్నట్లు తెలిపారు పోలీసులు.