నల్గొండ జిల్లాలో హాకీ వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం

 నల్గొండ జిల్లాలో హాకీ వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం

చిట్యాల, వెలుగు: ఉరుమడ్ల తెలంగాణ క్రీడా మైదానంలో హాకీ వేసవి శిక్షణ శిబిరాన్ని నల్గొండ జిల్లా క్రీడలు, యువజన శాఖ ఆధ్వర్యంలో గురువారం ప్రారంభించారు. జూన్ 6 వరకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు కోచ్ రాము తెలిపారు. హాజరయ్యేవారికి పట్ల నరసింహ టిఫిన్​అందిస్తారని చెప్పారు. 

చిట్యాల మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోనేటి యాదగిరి, కాంగ్రెస్ జిల్లా నాయకులు పల్లపు బుద్ధుడు, జరపాల శ్రీను, సోషల్ మీడియా ఇన్​చార్జి పట్ల జనార్ధన్, ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.