ఎవ్వల మాట వినం.. ఎగ్జామ్స్​ పెడ్తం

ఎవ్వల మాట వినం.. ఎగ్జామ్స్​ పెడ్తం
  •     ఫైనల్ పరీక్షలు రాయాలని స్టూడెంట్స్ పై ఒత్తిడి
  •     దగ్గరుండి రాయించాలని పేరెంట్స్ కి మెసేజ్ లు

‘ఏప్రిల్ 27 నుంచి మే 31 వరకు స్కూల్ స్టూడెంట్స్​కు సమ్మర్ హాలిడేస్, ఈ టైమ్ లో ఏ స్కూల్ మేనేజ్మెంట్ అయినా ఆన్‌లైన్ లేదా ఆఫ్​లైన్ క్లాసులు, ఎగ్జామ్స్ పెడితే కఠిన చర్యలు తీసుకుంటాం. కరోనా కేసులు పెరుగుతుండడంతో ఫైనల్ ఎగ్జామ్స్ లేకుండా 1 నుంచి 9వ తరగతి స్టూడెంట్స్ ను పై క్లాసులకు ప్రమోట్ చేస్తున్నాం’ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఇటీవల ప్రకటించారు. అయినా కొన్ని ప్రైవేటు స్కూల్స్ మేనేజ్ మెంట్లు ఈ ఆదేశాలను పట్టించుకోకుకుండా ఫైనల్ ఎగ్జామ్స్ పెట్టేందుకు సిద్ధమవు తున్నాయి. ఎగ్జామ్స్ టైం టేబుల్ పంపించి కచ్చితంగా పిల్లలు అటెండ్ అయ్యేలా చూడాలని పేరెంట్స్ కి ఎస్సెమ్మెస్ లు, ఈ-మెయిల్స్ పంపిస్తున్నాయి. ఎగ్జామ్స్ కి అటెండ్ అవడంతో పాటు పెండింగ్ ఫీజులు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నాయి. 

గతేడాది లాక్ డౌన్ నుంచి ఆన్​లైన్ సిటీలోని ప్రైవేటు స్కూల్ స్టూడెంట్స్ కు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి.  గతేడాది ఎగ్జామ్స్ లేకుండా ప్రభుత్వం స్టూడెంట్స్ ను పై తరగతులకు ప్రమోట్ చేసింది. ఆ తర్వాత అన్ లాక్‌ నుంచి ప్రైవేటు స్కూల్స్ మళ్లీ ఆన్ లైన్ క్లాసులను స్టార్ట్ చేశాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో స్కూల్స్ తెరుచుకోగా మేనేజ్ మెంట్లు అడ్డగోలుగా పేరెంట్స్ దగ్గరి నుంచి ఫీజులు వసూలు చేశాయి. పేరెంట్స్, వారి అసోసియేషన్లు ఎన్ని సార్లు విద్యాశాఖకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకుండా పోయింది. కరోనా సెకండ్ వేవ్ తో ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్ లోని స్టూడెంట్స్ చాలామంది వైరస్ బారినపడ్డారు. దీంతో స్కూల్స్ ప్రారంభమైన నెలరోజులకే వాటిని మూసివేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.  సెకండ్ వేవ్ తో తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఈ ఏడాది కూడా ఎలాంటి ఎగ్జామ్స్ లేకుండానే 1 నుంచి 9వ తరగతి స్టూడెంట్స్ ను పై క్లాసులకు ప్రమోట్ చేస్తూ ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ను సైతం గతేడాదిలానే ఎగ్జామ్స్ లేకుండానే పాస్ చేసింది. స్టూడెంట్స్ కు మే 31 వరకు సమ్మర్ హాలీడేస్ ఇచ్చామని..ఈ నేపథ్యంలో ఏ స్కూల్స్ మేనేజ్ మెంట్లు కూడా క్లాసులు కండక్ట్ చేయడం, ఎగ్జామ్స్ నిర్వహించడ చేయొద్దని పేర్కొంది.  స్కూల్స్ లో ఎలాంటి యాక్టివిటీస్ ఉండకూదని స్పష్టం చేసింది. కానీ సిటీలోని కొన్ని ప్రైవేటు స్కూల్స్ మేనేజ్ మెంట్లు ఈ రూల్స్ ను పాటించడం లేదు.  ‘ మూడు ఎగ్జామ్స్​ మాత్రమే మిగిలి ఉన్నాయని వాటిని ఇంటి దగ్గరే రాసి ఆన్సర్ షీట్లను మే 31లోపు స్కూల్ లో సబ్ మిట్ చేయండి ’  అంటూ స్టూడెంట్స్, పేరెంట్స్ పై ఒత్తిడి తెస్తున్నాయి.
 
 ఫీజు కట్టండి.. ఎగ్జామ్స్ రాయండి

‘డియర్ స్టూడెంట్స్.. ఈ ఏడాది మీ పెండింగ్ ఫీజులను క్లియర్ చేయండి. టీచర్లకు సపోర్ట్ చేయండి. వచ్చే ఏడాదికి ఫీజు డ్యూ ఉంటే మీకే ఇబ్బంది.. ఇప్పుడే క్లియర్ చేసుకోండి.’ ఇది ఓ ప్రైవేటు స్కూల్ మేనేజ్ మెంట్ పేరెంట్ కి పంపిన మెసేజ్. ప్రభుత్వం వద్దంటున్నా ప్రమోట్ చేసినా ఎగ్జామ్స్ నిర్వహించడానికి గల కారణం స్టూడెంట్స్ కి సబ్జెక్ట్ నాలెడ్జ్​ ఉండాలనే ఉద్దేశంతోనే అని  కొందరు స్కూల్ ప్రిన్సిపల్స్ అంటున్నారు. స్టూడెంట్స్ పై తాము ప్రెజర్ పెట్టడంలేదని, ఇష్టప్రకారమే అటెండ్ అవ్వాలని చెబుతున్నామని చెప్తున్నారు. పేరెంట్స్ లో మాత్రం ఎగ్జామ్స్ రాయకపోతే ఏమవుతుందో అనే భయాన్ని క్రియేట్ చేస్తున్నారు. అందరు పిల్లలు రాసి తమ పిల్లలు ఫైనల్ పరీక్షలు రాయకపోతే ఎలా అనే టెన్షన్ తో చాలామంది పేరెంట్స్ రాయిస్తున్నారు.  

ఫ్యూచర్ పై ఇంపాక్ట్ పడొద్దని..
గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఎందుకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారంటే ‘ఇష్టం ఉంటే ఉంచండి.. లేదంటే టీసీ తీసుకుని వెళ్లండి’ అని స్కూల్ మేనేజ్ మెంట్ అంటోంది. మేం న్యాయంగా వెళ్తే మా పిల్లల ఫ్యూచర్ ఆగమయ్యేలా ఉంది. అందుకే ఆన్​లైన్ లో ఎగ్జామ్స్ కి ఒకే అన్నాం. అందరు స్టూడెంట్స్  రాసి మా పిల్లలు రాయకపోతే ఎలా అనే టెన్షన్ ఉంది. ఇంకో నాలుగు ఎగ్జామ్స్ ఉన్నాయి. టైం టేబుల్ పంపారు. ఫీజు కట్టాలని ఎప్పటిలాగే మెసేజ్ లు, మెయిల్స్ పెడుతున్నరు. 
                                                                    - సత్యవతి, పేరెంట్, మహాత్మాగాంధీనగర్

ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లే
 
పేరెంట్స్ కి స్కూల్ మేనేజ్ మెంట్ చెప్పినట్లు చేయడం తప్ప వేరే దారి లేకుండా పోయింది. గతంలో ప్రైవేటు స్కూళ్ల అధిక ఫీజుల వసూలు గురించి కొన్నిరోజులు హాడావుడి చేసిన అధికారులు మేనేజ్ మెంట్లపై ఎలాంటి యాక్షన్ తీసుకోకుండానే వదిలేశారు.  అందుకే పేరెంట్స్ ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బందిపడుతున్నారు. ఎంతమందికి ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేనప్పుడు పిల్లల భవిష్యత్ గురించి మేనేజ్​మెంట్లు చెప్పినట్లుగా వినాల్సి  వస్తోందని పేరెంట్స్ చెప్తున్నారు. 
                                                   – వెంకట్, జాయింట్ సెక్రటరీ, స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్