జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతు ఇస్తున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ ప్రైవేట్ గుర్తింపు పొందిన పాఠశాలల కరస్పాండెంట్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. మంగళవారం జూబ్లీహిల్స్ లోని జూబ్లీ కన్వెన్షన్ హాల్ లో తమ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేస్తామని చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ విశ్వనాథ్, జీహెచ్ పీఆర్ఎస్సీఏ అధ్యక్షుడు జితేందర్ కుమార్, కార్యదర్శి ప్రణయ్ కుమార్ యాదవ్, వసీం ఉన్నిస్సా, ఆదినారాయణ పాల్గొన్నారు.
