OTT థ్రిల్లర్: సెక్స్ కుంభకోణంలో చిక్కుకున్న భర్త.. లాయర్‌‌‌‌‌‌‌‌గా ప్రియమణి ఏం చేసింది?

OTT థ్రిల్లర్: సెక్స్ కుంభకోణంలో చిక్కుకున్న భర్త.. లాయర్‌‌‌‌‌‌‌‌గా ప్రియమణి ఏం చేసింది?

సెలెక్టివ్‌‌‌‌ సబ్జెక్టులతో వరుస సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌‌‌‌ల్లోనూ నటిస్తోంది ప్రియమణి. ఇప్పటికే  భామా కలాపం, ఫ్యామిలీ మేన్ లాంటి వెబ్ సిరీస్‌‌‌‌లతో మెప్పించిన ఆమె.. ఇప్పుడు ‘గుడ్ వైఫ్‌‌‌‌’గా  ఆడియెన్స్‌‌‌‌ ముందుకు రాబోతోంది.

ఆమె లీడ్ రోల్‌‌‌‌లో నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ త్వరలోనే జియో హాట్‌‌‌‌స్టార్‌‌‌‌‌‌‌‌లో ఏడు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా రిలీజ్ చేసిన ఈ సిరీస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. ఇందులో ప్రియమణి లాయర్‌‌‌‌‌‌‌‌గా నటిస్తుండగా, ఆమె భర్త పాత్రలో సంపత్ రాజ్ జైలులో ఉన్నట్టుగా ఈ పోస్టర్‌‌‌‌‌‌‌‌లో కనిపించడం సిరీస్‌‌‌‌పై ఆసక్తిని పెంచుతోంది.

వీరికి ఒక కొడుకు, కూతురు కూడా ఉన్నారు. సెక్స్ కుంభకోణంలో చిక్కుకున్న భర్తని రక్షించుకునేందుకు భార్య ఏం చేసిందనేది ఈ సిరీస్ కథగా తెలుస్తోంది. ‘గుడ్ వైఫ్’పేరుతో వచ్చిన అమెరికన్ షో ఆధారంగా ఈ సిరీస్‌‌‌‌ను తెరకెక్కిస్తున్నారు. 

►ALSO READ | Kattappa Judgment: జూన్ 13న ‘కట్టప్ప జడ్జిమెంట్’.. ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్దమైన సత్యరాజ్