
Cochin Shipyard Shares: భారత అమ్ములపొదిలో ఉన్న ఆయుధాల పనితీరును ఇటీవల జరిగిన ఆపరేషన్ సిందూర్ సమయంలో ప్రపంచ దేశాలకు వెల్లడైంది. దీంతో అప్పటి నుంచి డిఫెన్స్ రంగంలోని కంపెనీలకు వరుస ఆర్డర్లతో పాటు డిఫెన్స్ స్టాక్స్ కి డిమాండ్ భారీగా పెరిగిపోతోంది. ప్రధానంగా దేశీయంగా తయారు చేయబడిన ఆయుధాల పనితీరు అందరి ఊహలకు అందని ఖచ్చితత్వాన్ని కలిగి ఉండటం పెట్టుబడిదారులను ఆకట్టుకుంటోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ కంపెనీ షేర్ల గురించే. గడచిన మూడు రోజుల నుంచి కంపెనీ షేర్లు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో మూడు రోజుల్లో స్టాక్ 30 శాతానికి పైగా రాబడిని తన పెట్టుబడిదారులకు అందించింది. నేడు సాయంత్రం 3.25 గంటల సమయంలో కేవలం 1.07 శాతం లాభంతో రూ.2వేల 377 వద్ద ఒక్కో షేరు ట్రేడవుతోంది. నేడు ఇంట్రాడోలే కంపెనీ షేర్లు అత్యధికంగా 8 శాతంపెరిగి రూ.2వేల 545 స్థాయికి చేరుకున్నాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మెుగ్గుచూపటంతో సాయంత్రానికి లాభాలు ఆవిరయ్యాయి.
స్టాక్ ఇంకా పెరుగుతుందా..?
డిఫెన్స్ స్టాక్ విషయంలో ప్రస్తుతం ఉన్న జోరు మరింత కాలం కొనసాగుతుందా లేదా అనే అనుమానాలు ప్రస్తుతం ఇన్వెస్టర్లను వెంటాడుతున్నాయి. అయితే కొచ్చిన్ షిప్‌యార్డ్ స్టాక్ పై బ్రోకరేజ్ సంస్థ వెత్త్‌మిల్స్ తన అంచనాలను ప్రకటించింది. స్టాక్ పడిపోతుందని బెట్ వేయెుచ్చని బ్రోకరేజ్ వెల్లడించింది. కేవలం స్టాక్ ఒక్క నెలలోనే 65 శాతం పెరిగినందున కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకునేవారు కొంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తు్న్నారు.
2025 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు స్టాక్ 55 శాతం రాబడిని తన పెట్టుబడిదారులుకు అందించింది. ఇది సెన్సెక్స్ ఇచ్చిన రాబడి కంటే దాదాపు 10 రెట్లు అధికం. అలాగే దీర్ఘకాలంలో కంపెనీ షేర్ల పనితీరును గమనిస్తే ఐదేళ్లలో 19వందల శాతం రాబడిని ఇన్వెస్టర్లు అందుతున్నారు. ప్రస్తుతం ఈ కంపెనీలో భారత ప్రభుత్వానికి 67.91 శాతం వాటాలు కూడా ఉన్నాయి.