
‘బాహుబలి’చిత్రంలో కట్టప్ప పాత్రతో పాపులర్ అయిన సత్యరాజ్.. ఇప్పుడు ఆ టైటిల్‌తోనే లీడ్ రోల్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కట్టప్ప జడ్జిమెంట్’.
ధెరన్ దర్శకత్వంలో ‘తీర్పుగల్ విర్కపడుమ్’ అనే తమిళ చిత్రాన్ని తెలుగులో ‘కట్టప్ప జడ్జిమెంట్’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు నిర్మాత రావూరి వెంకటస్వామి. జూన్ 13న తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
ఓ డాక్టర్ తన కుటుంబానికి జరిగిన అన్యాయంపై ఎలాంటి ప్రతీకారం తీర్చుకున్నాడన్నదే చిత్ర ఇతివృత్తమని, సత్యరాజ్ పాత్ర పవర్‌ఫుల్‌గా సాగుతుందని చిత్రబృందం పేర్కొంది. పూర్తి మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నిర్మాత అన్నారు. ఈ మూవీలో స్మ్రుతి వెంకట్, హరీష్ ఉత్తమన్, మధుసూధన్ రావు, రవిప్రసాద్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.