Akhil Zainab: అఖిల్ కంటే జైనాబ్ 8 ఏళ్లు పెద్దది.. ఎవరీ జైనాబ్? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇదే..

Akhil Zainab: అఖిల్ కంటే జైనాబ్ 8 ఏళ్లు పెద్దది.. ఎవరీ జైనాబ్? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇదే..

అక్కినేని అఖిల్ నేడు (జూన్6న) ఓ ఇంటి వాడయ్యారు. తెలుగు సంప్రదాయాలను గౌరవిస్తూ శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు తన ప్రియురాలు జైనాబ్ రవ్జీని అఖిల్ పెళ్లాడారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో ఈ కొత్త జంటకు సినీ సెలబ్రెటీలతో పాటు అక్కినేని ఫ్యాన్స్ నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

అఖిల్, జైనాబ్ ర‌వ్జీల ఎంగేజ్‍మెంట్ గతేడాది నవంబర్‌లోనే జరిగింది. ఇక ఆరునెలల తర్వాత వీరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే అఖిల్ భార్య జైనాబ్ రవ్జీ గురించి తెలుసుకోవాలని నెటిజన్లు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 

జైనాబ్ ర‌వ్జీ బ్యాక్గ్రౌండ్:

అఖిల్ అక్కినేని భార్య జైనాబ్ ర‌వ్జీ ముంబైకి చెందిన కళాకారిణి. స్వతహాగా పెయింటింగ్ ఆర్టిస్టు. ఇప్పటికే తన పెయింటింగ్స్తో హైదరాబాద్, ముంబయి, ఢిల్లి, లండన్, దుబాయ్లో ప్రదర్శనలు కూడా ఇచ్చింది. అంతేకాకుండా సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ కూడా. 

ముంబైకు చెందిన పారిశ్రామిక వేత్త జుల్ఫి రవ్జీ కుమార్తెనే జైనాబ్ రవ్జీ. ప్రస్తుతం జుల్ఫి రవ్జీ రియల్ ఎస్టేట్ వ్యాపారం, నిర్మాణ రంగంలో ప్రముఖ వ్యక్తిగా రాణిస్తున్నాడు. జైనాబ్ సోదరుడు జైన్ రావ్జీ, భారతదేశ క్లీన్ ఎనర్జీ రంగంలో 'ZR రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్‌కు' ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్. జైనాబ్ రవ్జీ ఫ్యామిలీకి బంజారాహిల్స్ రోడ్ నంబర్.7లో సొంత ఇల్లు కూడా ఉంది. 

జైనాబ్ తండ్రి జుల్ఫీ ర‌వ్జీ, హీరో నాగార్జున మంచి ఫ్రెండ్స్. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహమే అఖిల్, జైనాబ్ల ప్రేమకు మార్గం సుగమమైంది. ఇకపోతే హైద‌రాబాద్‌లో పుట్టిన జైనాబ్.. దుబాయ్‌లో పెరిగింది. అయితే, అఖిల్ కంటే తన భార్య జైనాబ్ 8 ఏళ్లు పెద్దది. ప్రస్తుతం అఖిల్ వయసు 31 ఏళ్లు కాగా.. జైనాబ్‍ది 39 కావడం విశేషం. 

జైనాబ్ ర‌వ్జీ సినిమాలు:

అఖిల్ భార్య జైనాబ్ ఆర్టిసుగా రాణిస్తూనే సినిమాల్లో కూడా నటించింది. ఎంఎఫ్ హుస్సేన్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన 'మీనాక్షి ఏ టేల్ ఆఫ్ త్రీ సిటీస్' అనే బాలీవుడ్‌ మూవీలో ఓ కీల‌క పాత్ర‌లో జైనాబ్ క‌నిపించింది. ప్రస్తుతం జైనాబ్ తన సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ కూడా ప్రైవేట్లో ఉంచడం గమనార్హం!

అఖిల్ రిసెప్షన్:

ఇకపోతే అఖిల్ రిసెప్షన్ వేడుక ఆదివారం (జూన్ 8న) పెద్దఎత్తున జరగనుంది. ఈ ఈవెంట్కి భారీ సంఖ్యలో సినీ, రాజకీయ, వ్యాపార సహా పలు రంగాల ప్రముఖులు హాజరుకాన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా నాగార్జున ఆహ్వానించిన సంగతి తెలిసిందే. వారు కూడా వచ్చే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే.. 2017లో అఖిల్కు, ఫ్యాషన్ డిజైనర్ శ్రేయా భూపాల్ నిశ్చితార్థం జరిగినప్పటికీ పెళ్లి రద్దైంది. ఆ తర్వాత శ్రేయా భూపాల్ మరొకరిని వివాహం చేసుకుంది. పెళ్లి రద్దు చేసుకున్న ఇన్నేళ్ల తర్వాత అఖిల్ వివాహ బంధంలోకి అడుగుపెట్టడంతో అక్కినేని కుటుంబంలో కోలాహలం కనిపించింది.