
వైవిధ్యమైన పాత్రలతో నటుడిగా ప్రత్యేక గుర్తింపును అందుకున్న ప్రియదర్శి (Priyadarshi)..జాతిరత్నాలు, మల్లేశం, బలగం లాంటి చిత్రాలతో హీరోగానూ మెప్పించాడు. ఈ క్రమంలో అతను హీరోగా వస్తోన్న లేటెస్ట్ మూవీ డార్లింగ్ (Darling). శుక్రవారం జులై 19న ప్రేక్షకుల ముందుకొస్తోన్న డార్లింగ్ మూవీ వరుస ప్రమోషన్స్ తో హైప్ ఎక్కిస్తుంది. ఫన్,లవ్,ఫ్యామిలీ డ్రామా,థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉన్న కంప్లీట్ ఎంటర్‌టైనర్ గా వస్తున్న ఈ మూవీ మేకర్స్ స్పెషల్ అనౌన్స్ చేశారు.
జులై 19న ప్రేక్షకుల ముందుకొస్తోన్న డార్లింగ్ మూవీని రిలీజ్ కంటే..ఒక రోజు ముందుగా పెయిడ్ ప్రీమియర్ షోను ప్రదర్శించనున్నట్లు వీడియో పోస్ట్ చేశారు. "హైదరాబాద్ లోని మూసాపేట్ శ్రీ రాములు బిగ్ స్క్రీన్ థియేటర్ లో జులై 18న సాయంత్రం 6:30 గంటలకు డార్లింగ్ ప్రీమియర్ షోలో మీ అందరినీ కలువబోతున్నాం" అంటూ చిత్రబృందం తెలిపింది.
Did you book your tickets for #Darling premiere? Log on to @bookmyshow and book your tickets NOW!
— Priyadarshi Pulikonda (@PriyadarshiPN) July 17, 2024
Book Now- https://t.co/30YizqsOnJ @Bookmyshow#SriramuluTheatre #DarlingPremiere #booknow @Primeshowtweets pic.twitter.com/AYfw6dymQx
అయితే, ఈ ప్రీమియర్ షోకు చిత్ర యూనిట్ పాల్గొంటుంది. రీసెంట్ టైంలో తెలుగు ఇండస్ట్రీలో ప్రీమియర్ షోల ట్రెండ్ వీపరీతంగా నడస్తుంది. అలాగే, సినిమా రిలీజ్ కు ముందే ఓ అంచలానాకు వచ్చేస్తున్నారు. కానీ, సినిమా ఫస్ట్ షో రిలీజ్ టాక్ బాగుంటే ఒకే. లేదంటే పోస్టర్ ఖర్చులకు కూడా పైసల్ రావు. ఇంకా చెప్పాలంటే..కనీసం, రిలీజ్ రోజు ఆడియన్స్ చూసి ఇచ్చే మౌత్ టాక్ తో అయిన నిర్మాతలు ఎక్కువ టిక్కెట్లు తెగుతాయి.పైసల్ కూడా వస్తాయి. ఈ సినిమా కథపై ఉన్న బలమైన నమ్మకంతోనే ప్రీమియర్ షో వేయాలని మేకర్స్ డిసైడ్ అయినట్టు టాక్. భార్య భర్తల మధ్య జరిగే గొడవ నేపథ్యంలో డార్లింగ్ కథ ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి ఎలా ఉండనుందో!
Also Read :- ఆర్. నారాయణ మూర్తికి అస్వస్థత
హనుమాన్ మూవీని నిర్మించిన ప్రొడక్షన్ హౌస్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు.డీసెంట్ మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ మ్యూజిక్ అందించనున్న ఈ సినిమాలో అనన్య నాగళ్ళ, మురళీధర్ గౌడ్, శివ రెడ్డి మరియు కృష్ణ తేజ వంటి తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.