పుష్పరాజ్ భార్యగా ప్రియమణి? వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్

పుష్పరాజ్ భార్యగా ప్రియమణి? వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్

పుష్పరాజ్(Pushparaj) భార్య శ్రీవల్లి కదా? మరి ప్రియమణి(Priyamani) అంటారేంటి? పుష్పరాజ్ భార్య ప్రియమణి అయితే మరి శ్రీవల్లీ ఏమవుతుంది? ప్రస్తుతం అల్లు అర్జున్(Allu arjun) ఫ్యాన్స్ మైండ్ లో రన్ అవుతున్న డౌట్స్ ఇవే. ప్రస్తుతం ఈ న్యూస్ నేషనల్ వైడ్ ట్రేడింగ్ గా మారింది. పుష్ప నుండి వినిపిస్తున్న ఈ న్యూస్ చూసి పార్ట్ 2 కోసం సుకుమార్ ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. 

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ పుష్ప ది రూల్. పుష్ప పార్ట్ 1 క్రియేట్ చేసిన రికార్డ్స్ తో పార్ట్2పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా భారీగా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా కోసం రూ.1000 కోట్ల ఆఫర్ వచ్చిందట. ఈ ఒక్క ఎగ్జామ్పుల్ చాలు పుష్ప పార్ట్2 పై అంచనాలను ఏ రేంజ్లో ఉన్నాయి చెప్పడానికి. 

ALSO READ :సారీ.. ఆ బోల్డ్ సిరీస్ నేను చేయలేనంటున్న లావణ్య త్రిపాఠి
 

అయితే తాజాగా ఈ సినిమా నుండి మరో ఇంట్రెసింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పుష్ప-2 మూవీలో ప్రియమణి నటిస్తున్నారట. అది కూడా పుష్పరాజ్ కు భార్యగా. ఇప్పటికే ఈ సినిమాలో రష్మిక మందన్న శ్రీవల్లీ పాత్రలో కనిపిస్తున్న విషయం తెలిసిందే. మొదటి పార్ట్ లో పుష్పరాజ్, శ్రీవల్లికి పెళ్లి కూడా జరిగింది. మరి ప్రియమణి పుష్పకు భార్యగా చేయడం ఏంటా? అనే అనుమానం కలుగుతోంది. కానీ ఈ విషయంపై పూర్తి వివరాలు తెలియరాలేదు. అంతేకాదు ఈ వార్తపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.