సారీ.. ఆ బోల్డ్ సిరీస్ నేను చేయలేనంటున్న లావణ్య త్రిపాఠి

సారీ.. ఆ బోల్డ్ సిరీస్ నేను చేయలేనంటున్న లావణ్య త్రిపాఠి

మెగా కుటుంబానికి కోడలు అవడం అనేది చాలా పెద్ద బాధ్యత. వాళ్ళు ఏం చేసినా చేసినా అభిమానులను దృష్టిలో పెట్టుకొని చేయాల్సి ఉంటుంది. కొంచం అంటూ ఇటుగా ఉన్నా వాళ్ళు తీసుకోలేరు. ఆ విషయంలో నోటుకి నూరుపాళ్లు విజయం సాధించారు రామ్ చరణ్(Ram charan) సతీమణి ఉపాసన(Upasana). ఇప్పుడు లావణ్యాత్రిపాఠి (Lavanya Tripathi) కూడా అదే పరిస్థితిలో ఉంది. 

ఇటీవల ఆమెకు మెగా హీరో వరుణ్ తేజ్(Varun tej) తో ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ జంట పెళ్లితో ఒకటికానున్నారు. ఈ కారణంగానే లావణ్య సినిమాలు చేయడం తగ్గించారు. ప్రస్తుతం ఆమె తమిళంలో ఒకేఒక సినిమా చేస్తున్నారు. ఆ సినిమా తప్ప మరే సినిమాకు కూడా ఆమె సైన్ చేయలేదు. 

అయితే తాజాగా ఆమె ఒక వెబ్‌ సిరీస్‌కి ఓకే చెప్పారని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ సిరీస్ ను విశ్వక్‌ ఖండేరావ్‌ తెరకెక్కించనున్నాడు. కథా పరంగా ఈ సిరీస్ లో హీరోయిన్ పాత్ర కాస్త బోల్డ్‌గా ఉంటుందని సమాచారం.అంతేకాదు ఇంటిమేట్‌ సీన్స్ కూడా ఉండనున్నాయట. దీంతో ఈ సిరీస్‌ మేకర్స్ కు మరో హీరోయిన్‌ని చూసుకోమని చెప్పేశారట లావణ్య. త్వరలో పెళ్లి కాబోతుంది 
కాబట్టి ఇప్పుడు ఇలాంటి కథల్లో నటించడం కరక్ట్ కాదని వారికి వివరించిందట లావణ్య. దీంతో ఆమె ఈ సిరీస్ నుండి అఫీషియల్ గా బయటకు వచ్చేశారు. మరి మేకర్స్ ఈ బోల్డ్ సిరీస్ కోసం ఏ హీరోయిన్ ను తీసుకుంటారో చూడాలి మరి.