V6 News

కలెక్టర్‌గా ప్రియాంక ఆల బాధ్యతలు

కలెక్టర్‌గా ప్రియాంక ఆల  బాధ్యతలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ జిల్లా కొత్త కలెక్టర్​‌గా ప్రియాంక ఆల ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.  ఇంతకుముందు  ఖైరతాబాద్ జోనల్ కమిషనర్​‌గా పనిచేసిన ఆమె సాధారణ బదిలీల్లో భాగంగా హైదరాబాద్ కలెక్టర్ గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.  ఇక్కడ పని చేసిన కలెక్టర్ హరిచందనకు రాష్ట్ర కార్మిక శాఖ కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు. 

రంగారెడ్డి కలెక్టరేట్: రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా డాక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆమె కామారెడ్డి జిల్లా బాన్సువాడ సబ్ కలెక్టర్ గా పనిచేశారు. బదిలీపై వచ్చిన ఆమె.. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం బాధ్యతలు చేపట్టారు.