పవన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ

పవన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ

పవర్​ స్టార్​ పవన్​ కల్యాన్​ ‘ఓజీ’ సినిమా ఆఫర్​తో ప్రియాంక అరుల్​ మోహన్​ ట్రెండింగ్​గా మారింది. తెలుగులో చేసింది రెండు సినిమాలే అయినా.. ఈ అమ్మడికి ఇంత భారీ అవకాశం ఇవ్వడం హాట్​టాపిక్​గా మారింది. అయితే, ప్రియాంకను ఈ రోల్​ కోసం తీసుకోవడం పూర్తిగా డైరెక్టర్​ సుజిత్​ చాయిస్​ అని తెలుస్తోంది.

నాని గ్యాంగ్​లీడర్​, శ్రీకారం వంటి సినిమాల్లో ఈ బ్యూటీ స్క్రీన్​ ప్రెజెన్స్​ ఈ కుర్ర దర్శకుడిని ఇంప్రెస్​ చేసిందట. అందుకే తన సినిమాలో ప్రియాంకను ఫిక్స్​ చేశాడని టాక్​. ఓజీ చాన్స్​తో ఈ సౌత్​ బ్యూటీకి సోషల్​ మీడియా ఫాలోయింగ్​ ఒక్కసారిగి పెరిగిపోయింది.

టాలీవుడ్​ నుంచి సైతం భారీ ఎత్తున అవకాశాలు వస్తున్నాయట. ప్రస్తుతం తన ఫోకస్​ అంతా పవన్​ సినిమాపైనే అంటూ కొత్త కమిట్మెంట్స్​కి నో చెబుతోందనే రూమర్స్​ వినిపిస్తున్నాయి.