
‘ఓజీ’ చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరిస్తోంది ప్రియాంక అరుళ్ మోహన్. పవన్ కళ్యాణ్‌కు జంటగా కన్మణి అనే పాత్రలో ఆమె కనిపించనుంది. ఇదిలా ఉంటే ఆమె ఓటీటీ ఎంట్రీకి రెడీ అయింది.
ప్రియాంక లీడ్ రోల్‌లో తమిళ దర్శకుడు రా కార్తిక్ ఓ చిత్రం తెరకెక్కిస్తున్నాడు. ఓటీటీ కోసమే తీస్తున్న ఫిమేల్ సెంట్రిక్ సినిమా ఇది. రైజ్ ఈస్ట్ ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి కావచ్చి నట్టు తెలుస్తోంది. త్వరలోనే నెట్ ఫ్లిక్స్‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది.
నాగార్జున హీరోగా 100వ సినిమా తీయబోతున్నాడు రా కార్తిక్. ఇటీవల ఈ విషయాన్ని నాగార్జున స్వయంగా రివీల్ చేశారు. ప్రియాంక నటించడంతో పాటు నాగార్జునతో సినిమా చేయబోయే దర్శకుడి సినిమా కావడంతో ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది. తెలుగు, తమిళ భాషల్లో వరుస క్రేజీ ప్రాజెక్ట్స్‌తో ఆకట్టుకున్న ప్రియాంక.. మరి ఓటీటీలోనూ మెప్పిస్తుందేమో చూడాలి!
ALSO READ : ‘ఓజీ’ ఫుల్ రివ్యూ.. పవన్ కల్యాణ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా హిట్టా? ఫట్టా?
ప్రియాంక అరుల్ మోహన్:
కోలీవుడ్ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ గురించి పరిచయం అక్కర్లేదు. 'ఓంధ్ కథే హెల్లా' మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు..2019లో ‘నాని గ్యాంగ్ లీడర్' చిత్రంతో తెలుగు అభిమానులను పలకరించింది. ఆ తర్వాత 'శ్రీకారం', 'సరిపోదా శనివారం' వంటి సినిమాల్లోనూ మెప్పించింది.
తన అందం, గ్లామర్, అద్భుతమైన నటనతో ఫ్యాన్స్‌ని కట్టిపడేసింది. ప్రస్తుతం తమిళంలో వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ తెలుగులో పవర్ స్టార్ సరసన 'ఓజీ'తో వచ్చి అలరిస్తుంది. త్వరలో సూర్య హీరోగా, పాండిరాజ్ దర్శకత్వంలో రానున్న సినిమాలో కూడా ప్రియాంక నటిస్తున్నట్లు సమాచారం.