
ఉత్తర్ ప్రదేశ్ లోని మహారాజ్ గంజ్ ఎన్నికల ప్రచారంలో బీజేపీపై విమర్శల ఎదురుదాడి చేశారు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకాగాంధీ వాద్రా. ఈస్ట్ యూపీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అయిన ప్రియాంక… గత ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీలను తన ప్రసంగాల్లో హైలైట్ చేస్తున్నారు.
నల్లధనం తెచ్చి.. ప్రతిపేదవాడి అకౌంట్ లో రూ.15లక్షలు వేస్తానని ప్రధానమంత్రి నరేంద్రమోడీ గత ఎన్నికల ప్రచారంలో చెప్పారని గుర్తుచేశారు ప్రియాంక. ఎన్నికల్లో గెలిచాక బీజేపీ నేతలు మాట మార్చారంటూ విమర్శించారు. ప్రధాని స్థాయి వ్యక్తి ఇచ్చిన హామీని.. అదో నోటి మాట మాత్రమే అంటూ ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తీసిపారేశారని.. అన్నారు. ఒకరేమో హామీలిస్తారు.. మరొకరు ఉట్టిమాటే అంటారు.. వీళ్లను మరోసారి నమ్ముదామా..? అని జనాన్ని ప్రశ్నించారు ప్రియాంక. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మాట మార్చారనీ… సంక్షేమ పథకాల లబ్దినే… పేదలకు ఇచ్చిన ప్రయోజనాలుగా చిత్రీకరించారని ప్రియాంక ఎద్దేవా చేశారు.