
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా క్వాంటికో సిరీస్ తో హాలీవుడ్ కు షిప్ట్ అయ్యింది. ఆ సిరీస్ సక్సెస్ కావడంతో అక్కడే వరుస సినిమాలు , సిరీస్ లు చేస్తూ సెటిల్ అయ్యింది ఈ అమ్మడు. ప్రస్తుతం ప్రియాంక చోప్రా బాలీవుడ్ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. రీసెంట్ గా పీసీ సిటాడెల్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఎప్పుడో షారుఖ్ ఖాన్ హాలీవుడ్ సినిమాలపై చేసిన కామెంట్స్ పై షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది.
గతంలో మీరు ఎందుకు హలీవుడ్ కి వెళ్లలేదు.. అన్న ప్రశ్న షారూఖ్ ని అడిగితే తనకు ఇక్కడ కంఫర్టబుల్ గానే ఉందన్నారు. అయితే షారుఖ్ కంఫర్ట్ కామెంట్స్ పై ప్రియాంక చోప్రా కౌంటర్ ఇచ్చింది. ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కోలా ఉంటాయని ..అవకాశం వస్తే ఎవరైనా తమ ప్రతిభ చాటాలని అనుకుంటారని చెప్పింది. కానీ కొందరు ఉన్న చోటే ఉండాలని అనుకుంటారని వ్యాఖ్యానించింది. తనకు ఛాన్స్ వచ్చిన చోట తన టాలెంట్ చూపిస్తానంది ప్రియాంక.