తొలిసారి తమ కూతురు ఫొటోలను షేర్​ చేసిన ప్రియాంక చోప్రా

తొలిసారి తమ కూతురు ఫొటోలను షేర్​ చేసిన ప్రియాంక చోప్రా

ఈ మధ్య కొంతమంది సెలబ్రిటీల వారికి పుట్టిన పిల్లల ముఖాలను చూపించడానికి ఇష్టపడడం లేదు. ముఖ్యంగా మీడియా వాళ్లకు అస్సలు చూపించడం లేదు. కొంతమంది అయితే.. ఫేస్ కనిపించకుండా.. కేవలం  పిల్లల సైడ్, బ్యాక్​ ఫోటోలు మాత్రమే పోస్ట్ చేస్తున్నారు. సమయం సందర్భంగా చూసుకుని అఫీషియల్​గా వారి పిల్లల ఫొటోలను రిలీజ్​ చేస్తున్నారు. అలా తాజాగా గ్లోబల్​ స్టార్ హీరోయిన్​​ ప్రియాంక చోప్రా తన కూతురు మాల్తీ మేరీ చోప్రా జోనస్ ముఖాన్ని చూపించి అభిమానులను సర్​ప్రైజ్ చేసింది.

సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ప్రియాంక తన సినిమాలు, వ్యక్తిగత విషయాలను ఎప్పుడూ అభిమానులతో పంచుకుంటుంది. అయితే తన కూతురు ఫొటోలు మాత్రం షేర్ చేయలేదు.  తాజాగా ప్రియాంక జోనాస్ బ్రదర్స్‌ వాక్ ఆఫ్ ఫేమ్ ఈవెంట్‌లో తన గారాలపట్టి మాల్తీతో కలిసి వేడుకలకు హాజరైంది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్​గా మారాయి. ఆ సమయంలో ప్రియాంక ఒళ్లో కూర్చొని చిరునవ్వులు చిందిస్తూ వైట్‌ డ్రెస్‌లో క్యూట్‌గా కనిపించింది. 

అమెరికా సింగర్, నటుడు నిక్ జొనాస్ ను 2018 డిసెంబర్ లో ప్రియాంక చోప్రా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. క్రిస్టియన్, హిందూ సంప్రదాయాల ప్రకారం పెళ్లి జరిగింది. ప్రియాంక చోప్రా దంపతులు తమ కుమార్తె మాల్తీ మేరీ చోప్రా జొనాస్ ను గత ఏడాది జనవరిలో సరోగసీ ద్వారా పొందారు.