ప్రియాంక చోప్రా దేశానికే గర్వకారణం

ప్రియాంక చోప్రా దేశానికే గర్వకారణం

దేశం గర్వించదగ్గ హాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో  ప్రియాంక చోప్రా ఒకరు. గత కొన్ని సంవత్సరాలుగా, ఆమె  ప్రపంచ వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ... హాలీవుడ్‌లో తనదైన స్థానాన్ని సంపాదించుకుంది. హాలీవుడ్‌ నటీనటులలో దేశం ప్రాతినిధ్యం కోసం ప్రియాంక ఏం చేసిందని చాలా మంది అనుకుంటారు. కానీ కొంతమంది నటీనటులే దానికి కృషి చేశారని, అందులో ప్రియాంక కూడా ఉందంటున్నారు చాలా మంది. అయితే నేడు (జులై 18) ప్రియాంక చోప్రా పుట్టినరోజు సందర్భంగా ఆమె భారతదేశం గర్వపడేలా చేసిన క్షణాలను ఒకసారి గుర్తు చేసుకుందాం.

  • రెండు దశాబ్దాలకు పైగా వినోద పరిశ్రమలో తన సత్తా కొనసాగిస్తోన్న  ప్రియాంక ... ఇప్పటివరకు చేసిన ప్రయాణంలో ఎన్నో మరపురాని క్షణాలున్నాయి. అందులో ఒకటి, ఆమె 'ఫోర్బ్స్' 100 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించడం. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న తొలి భారతీయ మహిళగా ప్రియాంక నిలవడం చెప్పుకోదగిన విషయం. ఇలా ఒక్కసారి మాత్రమే కాదు. ఈ జాబితాలో ప్రియాంక రెండుసార్లు చోటు దక్కించుకోవడం నిజంగా దేశం గర్వించదగ్గ విషయమనే చెప్పాలి.

  • 2018లో ‘వోగ్ అమెరికా’ కవర్‌పై కనిపించిన మొదటి దక్షిణాసియా వ్యక్తిగా ప్రియాంక చోప్రా నిలవడం మరో ముఖ్యమైన విషయం. ‘వోగ్ ఇండియా’ కవర్‌పై చాలాసార్లు కనిపించిన ప్రియాంక... మ్యాగజైన్ US ఎడిషన్ కవర్‌పై ప్రచురణైన మొదటి భారతీయ మహిళగా ప్రియాంక నిలిచింది.

  • 2019లో మొరాకోలో జరిగిన ఫెస్టివల్ ఇంటర్నేషనల్ డు ఫిల్మ్ డి మర్రకేచ్‌లో ప్రియాంకకు అవార్డు లభించింది. అవార్డు వేడుకలో హాలీవుడ్ నటుడు రాబర్ట్ రెడ్‌ఫోర్డ్ ఆమెను సత్కరించారు.

  • టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అంబాసిడర్‌గా ఎంపికైన మొట్టమొదటి భారతీయ నటిగా ప్రియాంక బాలీవుడ్‌లో చరిత్ర సృష్టించింది. 2020లో జరిగిన ఈవెంట్ 45వ ఎడిషన్‌కు ఆమెను ఆహ్వానించారు.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Priyanka (@priyankachopra)

  • 2016లో, ఆమె బాలల హక్కుల కోసం అండగా నిలుస్తోన్న  యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ప్రియాంక ప్రకటించబడింది. ఆమె గ్లోబల్ అంబాసిడర్ హోదాలో చేరడానికి ముందు 10 సంవత్సరాల పాటు సంస్థకు జాతీయ అంబాసిడర్‌గా ఉన్నారు.

  • ఛాలెంజింగ్ పాత్రలకు పేరుగాంచిన ప్రియాంక... 'కొత్త టీవీ సిరీస్‌లో ఇష్టమైన నటి' విభాగంలో 'పీపుల్స్ ఛాయిస్ అవార్డు' గెలుచుకున్నారు.  ఈ గౌరవం పొందిన తొలి భారతీయ నటిగా ప్రియాంక గుర్తింపు పొందింది. యుఎస్ థ్రిల్లర్ 'క్వాంటికో'లో  పాత్రకు ప్రియాంక ఈ అవార్డును గెలుచుకుంది.

  • బుల్గరీకి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గానూ ప్రియాంక చోప్రా ఎంపికయ్యారు. ఇటీవల ప్రకటించిన లగ్జరీ బ్రాండ్ బుల్గరీకి ఎంపికైన వారిలో ఒకరైన ప్రియాంక... ఈ ఘనత దక్కించుకున్న తొలి భారతీయ మహిళగానూ రికార్డులకెక్కింది.

  • ఇక ప్రియాంక లైఫ్ లోనే అత్యంత ప్రత్యేకమైన విజయంగా భావించే మరో గొప్ప గౌరవం .... గ్లోబల్ వేదికపై విశ్వ సుందరిగా వెలుగొందడం. భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి, దేశానికి ఈ పేరు తెచ్చినప్పుడు ప్రియాంక వయసు 18 ఏళ్లు మాత్రమే. ఆమె 2000 సంవత్సరంలో ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకొని చరిత్రలకెక్కింది. అప్పట్లోనే ఆమె ఆత్మవిశ్వాసం, అందాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారంటే అతిశయోక్తి కాదు.