హైదరాబాద్ వస్తున్న ప్రియాంక గాంధీ

V6 Velugu Posted on Nov 23, 2021

కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రేపు (బుధవారం) తన కుమారుడు రైహాన్ సహా హైదరాబాదు వస్తున్నారు. రైహాన్ కంటి గాయానికి హైదరాబాదులోని ప్రముఖ ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో చికిత్స చేయించనున్నారు. నాలుగున్నరేళ్ల కిందట రైహాన్ క్రికెట్ ఆడుతుండగా కంటికి దెబ్బ తగిలింది. ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్లు  హైదరాబాదులోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. అప్పట్లో  ఆస్పత్రిలో  రైహాన్‌కు కంటి పరీక్షలు చేయించారు. ఇప్పుడు.. చికిత్స చేయించేందుకు బుధవారం ఆమె నగరానికి వస్తున్నారు.ట్రీట్మెంట్ తర్వా త మళ్లీ  రేపు సాయంత్రం ఢిల్లీ తిరుగు పయనం కానున్నారు.

ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా దంపతులకు కమారుడు రైహాన్.. వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ గా చిన్న వయసులోనే ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు.

Tagged Hyderabad, son, Priyanka Gandhi, eye treatment

Latest Videos

Subscribe Now

More News