హత్రాస్​ ఘటనలో వాస్తవాలు చెప్పండి : ప్రియాంక గాంధీ

హత్రాస్​ ఘటనలో వాస్తవాలు చెప్పండి : ప్రియాంక గాంధీ

న్యూఢిల్లీ: హత్రాస్ తొక్కిసలాటపై వాస్తవాలను దాయొద్దని, ఈ ఘోరానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ విమర్శించారు. బుధవారం ఈ మేరకు ప్రియాంక ట్వీట్ చేస్తూ.. ‘‘సత్సంగ్ కు అనుమతించిన దాని కంటే మూడు రెట్లు ఎక్కువగా జనం వచ్చారు. ప్రమాద స్థలంలో ప్రభుత్వ యంత్రాంగంలేదు.

జనాలను అదుపుచేయడానికి అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. మెడికల్ బృందాలు, అంబులెన్స్ లు లేవు. ఆస్పత్రిలో డాక్టర్లు అందుబాటులో లేరు. ఇంత పెద్ద ఎత్తున నిర్లక్ష్యం కనిపిస్తున్న ఎవరు కూడా బాధ్యత తీసుకోవడం లేదు. హత్రాస్​లో జరిగిన ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారు..? ” అని ప్రశ్నించారు.