న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే రాసిన లేఖకు సమాధానం ఇవ్వకుండా ప్రధాని నరేంద్ర మోదీ ఆయన్ను అవమానించారని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ అన్నారు. ప్రజాస్వామ్య విలువలపై విశ్వాసం, పెద్దలంటే గౌరవం ఉంటే ప్రధాని స్వయంగా జవాబు ఇచ్చేవారని తెలిపారు.
కానీ అందుకు విరుద్ధంగా బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి జేపీ నడ్డా ద్వారా ఒక చౌకబారు ప్రత్యుత్తరం రాయించారని మండిపడ్డారు. అత్యున్నత స్థానాల్లో ఉన్న నేతలు ప్రజాస్వామ్యంలోని గొప్ప సంప్రదాయాలను తిరస్కరించడం దురదృష్టకరమని శుక్రవారం ఆమె విమర్శించారు. సమాధానం ఇస్తే మోదీ ఇమేజ్ పెరిగేదని పేర్కొన్నారు.