యూపీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం

V6 Velugu Posted on Nov 15, 2021

వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తుపెట్టుకోవడం లేదని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తెలిపారు. మొత్తం 403 స్థానాల్లోనూ కాంగ్రెస్‌ ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్పారు. ఇందులో 40 శాతం స్థానాల్లో మహిళలు పోటీ చేయనున్నారన్నారు. పశ్చిమ యూపీలోని బులంద్‌షహర్‌లో కాంగ్రెస్‌ నిర్వహిస్తున్న 'ప్రతిజ్ఞ సమ్మేళన్‌-లక్ష్య 2022' కార్యక్రమంలో పాల్గొన్న ప్రియాంక మాట్లాడారు. ఉత్తరప్రదేశ్‌లోని అన్ని అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్‌ కార్యకర్తలను మాత్రమే నామినేట్‌ చేస్తామన్నారు. కాంగ్రెస్‌ గెలవాలనుకుంటే ఒంటరిగానే విజయం సాధిస్తుందని తెలిపారు.

అఖిలేష్‌ యాదవ్‌ ఆధ్వర్యంలోని సమాజ్‌ వాదీ పార్టీతో చర్చలు జరిపారన్న ఊహాగానాలకు ప్రియాంక గాంధీ కొట్టిపడేశారు. ఒంటరిగానే బరిలోకి దిగుతున్నామని చెప్పారు. 

Tagged Priyanka Gandhi, contest, UP elections, alone

Latest Videos

Subscribe Now

More News