పార్లమెంట్ ఆవరణలో కొత్త సీన్ కనిపించింది. ప్రధాని మోడీ ప్రతిపక్ష నేతతో కలిసి టీ తాగారు. లోక్ సభ సెషన్స్ బ్రేక్ సమయంలో.. లోక్ సభ స్పీకర్ ఓమ్ బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కలిసి కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ టీ తాగటం చర్చనీయాంశంగా మారింది.
శుక్రవారం (డిసెంబర్ 19) పార్లమెంట్ సమావేశాల సందర్భంగా.. బ్రేక్ టైమ్ లో ప్రియాంకతో కలిసి టీ తాగారు. ప్రియాంక గాంధీ పక్కన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆ పక్కన ప్రధాని మోదీ, మోదీకి కుడివైపున స్పీకర్ ఓం బిర్లా కూర్చుని టీ తాగుతూ చర్చలో ఉండటం గమనించవచ్చు.
Also Read : వచ్చే ఎన్నికల వరకు నేనే సీఎం
పార్లమెంటు సంప్రదాయాల ప్రకారం.. ప్రతి సెషన్ పూర్తయిన తర్వాత.. స్పీకర్ పార్లమెంటు సభ్యులకు, మంత్రులకు టీ పార్టీ ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఏర్పాటు చేసిన టీ పార్టీకి ప్రియాంక గాంధీ హాజరు కావడం, తను ఎప్పుడూ విమర్శలతో విరుచుపడే నేతలతో కూర్చోవడం ఆసక్తికర పరిణామంగా మారింది. ఈ సందర్భంగా పార్లమెంటు అంశాలు కాకుండా, ఇతర సాధారణ విషయాలపై సరదాగా చర్చించినట్లు తెలుస్తోంది.
