రెజ్లర్లకు మద్దతుగా ప్రియాంక గాంధీ

 రెజ్లర్లకు మద్దతుగా ప్రియాంక గాంధీ

రెజ్లింగ్ స‌మాఖ్య చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూష‌ణ్‌పై చర్యలు తీసుకోవాలంటూ.. దేశ రాజధాని ఢిల్లీలో మహిళా రెజ్లర్ల నిరసనలు కొనసాగుతున్నాయి. వీరి నిరసనకు పలు రాజకీయ పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్న రెజ్లర్లకు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ మద్దతుగా నిలిచారు. రెజ్లర్లకు సంఘీభావం పలుకుతూ దీక్షలో పాల్గొన్నారు. రెజ్లర్లతో మాట్లాడిన ఆమె వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా మహిళా రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేశ్ ఫొగాట్ ప్రియాంక గాంధీకి తమ సమస్యలను చెప్పుకున్నారు. 

ఎంపీ బ్రిజ్ భూషన్ పై కేసు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ రిపోర్టు కాపీని ఎందుకు ఇవ్వడం లేదంటూ.. ఢిల్లీ పోలీసులపై ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెజ్లర్లసమస్యను ప్రధాని మోడీ పరిష్కరిస్తారన్న నమ్మకం లేదని.. ఒకవేళ వీరి గురించి ఆయన ఆందోళన చెంది ఉంటే.. ఇంతవరకూ రెజ్లర్లతో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.  కనీసం రెజ్లర్లను కలవడానికి కూడా ప్రయత్నించలేదు’’ అని ప్రియాంక నిలదీశారు. రెజ్లర్లకు దేశమంతా అండగా ఉంటుందని ఆమె ధైర్యం చెప్పారు.