
ముస్లిం విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ సోమవారం ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ధర్నా చేపట్టారు. సిటిజెన్‌షిప్ అమెండ్‌మెంట్ చట్టానికి (సిఎఎ)ను వ్యతిరేకిస్తూ ఆదివారం సాయంత్రం ఆందోళన చేస్తున్న జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ, అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీల విద్యార్ధులపై పోలీసులు దాడి చేశారు. ఇందుకు నిరసనగా ప్రియాంక ఇండియా గేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్‌కు చెందిన పలువురు నాయకులు ఈ ధర్నాలో పాల్గొన్నారు.