
కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ మౌన దీక్ష చేపట్టారు. లఖింపూర్ ఖేరీ హింసలో ప్రమేయం ఉన్నట్టుగా భావిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రాను డిస్మిస్ చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. లఖింపూర్ లో రైతులపై హత్యకు నిరసనగా... లక్నోలోని GPO ఏరియాలో ఉన్న గాంధీ విగ్రహం ముందు మౌన దీక్షకు దిగారు. ఆమెతో పాటు వందల మంది కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు దీక్షలో కూర్చున్నారు.