ట్విట్టర్ లోకి ప్రియాంక గాంధీ.. 16 గంటల్లో 60 వేల ఫాలోయర్లు

ట్విట్టర్ లోకి ప్రియాంక గాంధీ.. 16 గంటల్లో 60 వేల ఫాలోయర్లు

రాజకీయ నాయకులు తాము చేసే ప్రతి యాక్టివిటీ వేగంగా ప్రజల్లోకి చేరేందుకు సోషల్ మీడియానే వేదికగా ఎంచుకుంటున్నారు. యువత ఎక్కువగా ఈ ప్లాట్ ఫాంను ఫాలో అవుతుండడంతో లీడర్లు కూడా అప్ డేటెడ్ గా ఉంటున్నారు. కొత్తగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న ప్రియాంక గాంధీ వాద్రా కూడా అదే బాటలో ట్విట్టర్ లోకి అడుగుపెట్టారు.

నిన్న (ఆదివారం) రాత్రి 10.45 గంటలకు ప్రియాంక గాంధీ ట్విట్టర్ అకౌంట్ యాక్టివేట్ అయింది. @priyankagandhi పేరుతో ఆమె ట్విట్టర్ అకౌంట్ ను క్రియేట్ చేసుకున్నారు. దీన్ని ఫాలో అవ్వాలంటూ పార్టీ శ్రేణులు, అభిమానులకు కాంగ్రెస్ అధిష్ఠానం ట్వీట్ చేసింది.

ట్విట్టర్ అకౌంట్ యాక్టివేట్ అయిన పదహారు గంటల్లోపే 60 వేల మందికి పైగా ఫాలోయర్లు వచ్చి చేశారు. ప్రియాంక ఇప్పటికి కేవలం ఏడుగురిని ఫాలో అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, సచిన్ పైలట్, జ్యోతిరాదిత్య సింథియా, అశోక్ గెహ్లాట్, అహ్మద్ పటేల్, రణ్ దీప్ సింగ్ సుర్జేవాలా ట్విట్టర్ అకౌంట్లను ఆమె ఫాలో అవుతున్నారు. అయితే ఇంకా ఆమె ఒక్క ట్వీట్ కూడా చేయలేదు.