వారణాసిలో మోదీపై ప్రియాంక పోటీ?

వారణాసిలో మోదీపై ప్రియాంక పోటీ?
  • కాంగ్రెస్ యూపీ నేతల కసరత్తు

లక్నో : రాబోయే ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీకి పోటీగా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీని దింపాలని ఆ పార్టీ యోచిస్తోంది. అందుకు ఆమెను, హైకమాండ్​ను ఒప్పించేందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. ‘‘ప్రియాంకా గాంధీ వచ్చే లోక్​సభ ఎన్నికల్లో ఆమె కోరుకున్న ఏ సెగ్మెంట్​ నుంచి అయినా పోటీ చేయొచ్చు. అయితే, తాము మాత్రం ఆమె వారణాసి నుంచి పోటీ చేయాలని కోరుకుంటున్నాం. మేము గెలిపించుకుంటాం”అని ఉత్తరప్రదేశ్ పీసీసీ చీఫ్ అజయ్ రాయ్ తెలిపారు. అందుకు హైకమాండ్​కు త్వరలోనే ప్రతిపాదనలు పంపుతామని మీడియాకు వెల్లడించారు.

వరుసగా నాలుగోసారి?

ప్రియాంక గాంధీ 2009 నుంచి  వరుసగా మూడుసార్లు వారణాసిలో పోటీ చేసి ఓడిపోయారు. 2009లో బీజేపీ సభ్యుడు మురళీ మనోహర్ జోషి చేతిలో ఓటమిపాలయ్యారు. 2014, 2019లో రెండుసార్లు మోదీపై పోటీ చేసి ఓడిపోయారు. 2024లోనూ అదే సెగ్మెంట్​ నుంచి పోటీ చేస్తే కాంగ్రెస్​కు కలిసివస్తుందని యూపీకి చెందిన ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. 1991 నుంచి వారణాసి నియోజకవర్గం బీజేపీకి కంచుకోటగా ఉంది. ఇప్పటివరకు ఆ స్థానం నుంచి 2004లో ఒక్కసారి మాత్రమే కాంగ్రస్ గెలిచింది. 

కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని అజయ్ రాయ్ అన్నారు. ఆ సెగ్మెంట్ నుంచి ఎంపీగా ఉన్న స్మృతీ ఇరానీ అమలు చేయని హామీలపై అక్కడి ప్రజల్లో ఆగ్రహం ఉందని, వాళ్లంతా ఈసారి కాంగ్రెస్​నే గెలిపించుకుంటారని చెప్పారు. కాంగ్రెస్​కు యూపీ కీలకమని, పార్టీ అగ్ర నేతలు త్వరలోనే రాష్ట్రంలో యాక్టివ్ అవుతారని తెలిపారు.