ఉపేంద్ర భార్య 50వ చిత్రం.. డిటెక్టివ్ తీక్షణ

ఉపేంద్ర భార్య  50వ చిత్రం..   డిటెక్టివ్ తీక్షణ

కన్నడ స్టార్ ఉపేంద్ర భార్య ప్రియాంక లీడ్‌‌‌‌‌‌‌‌ రోల్‌‌‌‌‌‌‌‌లో నటించిన చిత్రం ‘డిటెక్టివ్ తీక్షణ’. త్రివిక్రమ్ రఘు దర్శకత్వంలో గుత్తా ముని ప్రసన్న, ముని వెంకట చరణ్ నిర్మించారు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బెంగళూరులో జరిగింది. ముఖ్య​ అతిథిగా హాజరైన ఉపేంద్ర మాట్లాడుతూ ‘ప్రతి మహిళలోనూ ఒక డిటెక్టివ్ ఉంటారు. ముఖ్యంగా మా ఇంట్లో. ప్రతి భర్తకు తన భార్య డిటెక్టి వే. డిటెక్టివ్ పాత్రలు సరిగ్గా తీస్తే.. అవి తెరపై అద్భుతాలు చేస్తాయి. ఈ సినిమాతో ప్రియాంక 50 చిత్రాలు పూర్తి చేసిం ది. నేనింకా 46వ సినిమా దగ్గరే ఆగాను. వందో చిత్రానికి మేమిద్దరం కలిసి వర్క్ చేస్తామని ఆశిస్తున్నా’ అన్నారు. ప్రియాంక మాట్లాడుతూ ‘ఇందులో నా క్యారెక్టర్ ఫిజికల్‌‌‌‌‌‌‌‌గా కంటే  మెంటల్‌‌‌‌‌‌‌‌గా ఎంతో స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌, షార్ప్, బ్రిలియంట్‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది’ అన్నారు. ‘వరుస హత్యల కేసును ఇన్వెస్టిగేట్ చేసే డిటెక్టివ్‌‌‌‌‌‌‌‌గా ప్రియాంక నటించారు. యాక్షన్ సీన్స్‌‌‌‌‌‌‌‌లో ఆమె అద్భుతంగా నటించారు. మరో రెండు నెలల్లో ఏడు భాషల్లో సినిమా రిలీజ్‌‌‌‌‌‌‌‌కు ప్లాన్ చేస్తున్నాం’ అని దర్శకనిర్మాతలు చెప్పారు.