
ముంబై: పదేండ్లుగా అభిమానులను విశేషంగా అలరిస్తున్న ప్రొ కబడ్డీ లీగ్12వ ఎడిషన్‌తో ముందుకు రానుంది. ఆగస్టు 29న కొత్త సీజన్ ప్రారంభం అవుతుందని లీగ్ ఆర్గనైజర్స్ బుధవారం ప్రకటించారు. ‘ఇటీవల జరిగిన వేలంలో 12 ఫ్రాంచైజీలు తమ జట్లను బలోపేతం చేసుకున్నాయి. రాబోయే సీజన్ గొప్ప పోటీని, వినోదాన్ని అందిస్తుంది’అని పేర్కొన్నారు.
వేదికలు, ఇతర వివరాలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. మే 31, జూన్ 1 తేదీల్లో ముంబైలో నిర్వహించిన వేలంలో రికార్డు స్థాయిలో 10 మంది ఆటగాళ్లు కోటి రూపాయలకు పైగా ధర పలికారు. కాగా, గత సీజన్‌లో గెలిచిన హర్యానా స్టీలర్స్ తొలిసారి చాంపియన్‌గా నిలిచింది.