ప్రో కబడ్డీ సీజన్ 11లో తెలుగు టైటాన్స్‌పై తమిళ్ తలైవాస్ భారీ విజయం సాధించింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఇవాళ (అక్టోబర్ 19) జరిగిన మ్యాచులో 29–44 తేడాతో తమిళ్ తలైవాస్ గెలుపొందింది. తద్వారా లీగ్‌ను తమిళ్ తలైవాస్ ఘన విజయంతో మొదలుపెట్టింది. తొలి మ్యాచ్‌లో ఘన విజయంతో లీగ్‌ను ఆరంభించిన తెలుగు టైటాన్స్ రెండో మ్యాచ్‌లో పూర్తిగా నిరాశ పరిచింది. నరేందర్ ఖండోలా, సచిన్ సూపర్ టెన్స్‌తో విజృంభించడంతో తమిళ్ తలైవాస్ టోర్నమెంట్‌ను భారీ విజయంతో ఆరంభించింది. మొదట్లో విజృంభించిన తెలుగు టైటాన్స్ స్టార్ రైడర్ పవన్ సెహ్రావత్ (10) చివర్లో తడబడటంతో తైలుగు టైటాన్స్‌కు ఓటమి తప్పలేదు.
ALSO READ : IND Vs NZ, 1st Test: పోరాటం సరిపోలేదు: ఓటమి దిశగా భారత్.. న్యూజిలాండ్ ముందు స్వల్ప లక్ష్యం
మరో స్టార్ రైడర్ విజయ్ మాలిక్ (9) పోరాడినా ఫలితం లేకపోయింది. తమిళ్ తలైవాస్ జట్టులో నరేందర్, సచిన్ చెరో పది పాయింట్లు రాబట్టగా.. డిఫెండర్ సాహిల్ గులియా ఐదు పాయింట్లతో హై ఫైవ్ సాధించి జట్టుకు ఘన విజయాన్ని అందించారు.