డల్లాస్, న్యూయార్క్ చేస్తామన్నారు.. అధికారం అడ్డంపెట్టుకొని కబ్జాలు చేశారు..

డల్లాస్, న్యూయార్క్ చేస్తామన్నారు..  అధికారం అడ్డంపెట్టుకొని కబ్జాలు చేశారు..

హైదరాబాద్​ నగరాన్ని డల్లాస్, న్యూయార్క్​లాగా చేస్తామని చెప్పి బీఆర్​ఎస్​ పార్టీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని కబ్జాలు చేసిందని టీజేఎస్​ అధ్యక్షుడు ప్రొ.కోదండరాం విమర్శించారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్  గాంధీ సెంటనరీ హాల్ లో తెలంగాణ సమాజ కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ వినయ్ ఆధ్వర్యంలో... రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. 

ఈ మీటింగ్ కి తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొ. కోదండరామ్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కన్వీనర్ అలె భాస్కర్ తో పాటు... పలువురు రాజకీయ  పార్టీ నేతలు హాజరయ్యారు. బీసీ ముఖ్యమంత్రి-రాజకీయ పక్షాల అభిప్రాయాలపై నేతలు ఈ సందర్భంగా చర్చించారు. 

ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ... దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని మాట ఇచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తప్పారని ఆయన విమర్శించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని బీఆర్​ఎస్​ నేతలు రాష్ట్రంలో వనరులను కొల్లగొడుతున్నారని మండిపడ్డారు.  బీసీ ముఖ్యమంత్రి కావాలనే డిమాండ్ ప్రజల్లో వచ్చిందన్నారు.  

బాధితులకు పరిహారం అందించాలి..

వర్షాల వల్ల నష్టపోయిన బాధితులకు త్వరగా నష్టపరిహారం అందించాలని కోదండరాం డిమాండ్​చేశారు. బీర్ఎస్​ నేతల కబ్జాలతో హైదరాబాద్​ నగరం తరచూ ముంపునకు గురవుతోందని ఆరోపించారు. గురుకుల పరీక్షలన్నీ ఒకే ప్రాంతంలో నిర్వహించాలని డిమాండ్​చేశారు. సొంత గ్రామాల్లోనే పరీక్షలు నిర్వహించాలని కోరారు.