- సుప్రీంకోర్టు ఆదేశాల మేరకేనని టెక్నికల్ ఎడ్యుకేషన్ శాఖ వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 390 మంది ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు షాక్ తగిలింది. న్యాయపరమైన చిక్కులతో వీరికి ప్రస్తుతం ప్రొబేషన్ డిక్లేర్ చేయడం లేదని, రెండో ఇంక్రిమెంట్ కూడా బంద్ చేస్తున్నామని టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ వెల్లడిం చింది.
కాంట్రాక్ట్ నుంచి రెగ్యులర్ అయిన వీరి నియామకంపై జీఓ 16 ప్రకారం గతంలో హైకోర్టు వెలువరిం చిన తీర్పును సవాల్ చేస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారించిన న్యాయస్థానం ‘స్టేటస్ కో’ విధించిం ది.
దీంతోఅడిషనల్ అడ్వొకేట్ జనరల్ న్యాయ సలహా మేరకు.. ప్రొబేషన్ ను పెండింగ్ లో పెడుతున్నామని టెక్నికల్ ఎడ్యుకేషన్ అధికారులు తాజాగా మెమో జారీ చేశారు.
