పింఛన్ ఇవ్వాలంటే లంచంగా నాటుకోడి ఇవ్వాల్సిందే!

పింఛన్ ఇవ్వాలంటే లంచంగా నాటుకోడి ఇవ్వాల్సిందే!

పెన్షన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతన్నం
ఎవ్వరు పట్టించుకుంట లేరు
లంచంగా నాటుకోడి పుంజు కూడా ఇచ్చిన
ఇంటికి పెద్దదిక్కు పోయిండు ..ఎట్ల బతకాలె
కన్నీటి పర్యంతమైన ఒంటరి మహిళలు, వృద్ధులు, వితంతువులు

హైదరాబాద్: ‘‘మూడు నాలుగేండ్లుగా అప్లికేషన్లు పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరుగుతన్నం. కనపడ్డ ఆఫీసర్​ను అడుగుతున్నం. ఎవ్వరు పట్టించుకుంట లేరు. పెన్షన్ ​రాకపోతే ఎట్ల బతకాలె సారూ”అంటూ పలువురు ఒంటరి మహిళలు, వృద్ధులు, వితంతువులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి.. ఇబ్బంది పడుతున్నా సర్కారు కనీసం పెన్షన్​ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఇందిరా పార్క్ ధర్నాచౌక్ లో రైతు స్వరాజ్య వేదిక, మరో 20 సంఘాల ఆధ్వర్యంలో పెన్షన్ దరఖాస్తుదారులతో పబ్లిక్ హియరింగ్, ధర్నా చేపట్టారు. తమ బాధలు చెప్పుకునేందుకు రాష్ర్ట వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి సుమారు 300 మంది దరఖాస్తుదారులు తరలివచ్చారు. ప్లకార్డులతో నిరసన తెలిపారు.  ఆసరా దరఖాస్తుదారులు జ్యూరీ సభ్యుల మందు వారి గోడు  వెల్లబోసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. పెన్షన్ల కోసం ఎన్నో సార్లు అప్లికేషన్లు పెట్టామని, అధికారుల చుట్టూ తిరుగుతున్నా రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్ ఎప్పుడు వస్తదని అడిగితే కేసీఆర్, కేటీఆర్ ను అడగండని అధికారులు సమాధానాలు చెబుతున్నారని వాపోయారు.
 

లంచంగా పైసలతో పాటు నాటుకోడి ఇచ్చినా
ఓ ముసలయ్య అయితే  పింఛన్ కోసం వీర్వోకి రూ.5వేలు ఇచ్చానని.. అది సరిపోక కోడిపుంజు కూడా ఇచ్చానని చెప్పుకొచ్చాడు. పింఛన్ ఇస్తానని పేరు రాసుకుని పత్తాకు లేకుండా పోయాడన్నారు. అప్లై చేసు ఏళ్లు గడుస్తున్నా పింఛన్ మాత్రం రావడంలేదని పూట గడవడం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. 


ఎన్నికల హామీ నెరవేర్చలే..
ఎన్నికల ముందు పెన్షన్​వయోపరిమితి తగ్గిస్తామని ప్రకటిస్తే.. అధికార పార్టీకి ప్రజలు ఓట్లు వేశారని ఇంత వరకు కొత్త పెన్షన్లు మంజూరు చేయలేదని రైతు స్వరాజ్య వేదిక నేతలు కొండల్ రెడ్డి, కన్నెగంటి రవి అన్నారు. ఇతర ప్రాజెక్టులకు వేల కోట్లు ఖర్చు చేసే ప్రభుత్వం దగ్గర పేద కుటుంబాలను ఆదుకునేందుకు నిధులు లేవా అని ప్రశ్నించారు. ఆసరా పెన్షన్లపై ‘వెలుగు’లో సోమవారం పబ్లిష్ అయిన “ఉన్నయి తీసేస్తున్నరు.. కొత్తయి ఇస్తలే ”స్టోరీని రైతు స్వరాజ్య వేదిక నిర్వాహకులు సమావేశంలో ప్రదర్శించారు.

ఇంటికి పెద్దదిక్కు పోయిండు ..ఎట్ల బతకాలె
మూడు నాలుగేండ్లుగా అప్లికేషన్లు పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నామని, అయినా పెన్షన్లు ఇవ్వడం లేదని ఒంటరి మహిళలు, వృద్ధులు, వితంతువులు కన్నీటి పర్యంతమయ్యారు. పెన్షన్​రాకపోతే ఎట్ల బతకాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 
 

అప్పు కట్టలేక ఆత్మహత్య చేసుకుండు
నా భర్త రెండేండ్ల కింద 5 బోర్లు వేసిండు. అయినా నీళ్లు పడలేదు. రూ.10 లక్షల వరకు అప్పు అయింది. అప్పు ఎట్ల కట్టాలని ఆత్మ హత్య చేసుకున్నాడు. ఆయన వయసు 55 ఏండ్లే అయినా.. ఆధార్ కార్డులో 62 ఏండ్లని పడ్డది. రైతు బీమా పైసలు కూడా రాలేదు. వితంతువు పెన్షన్​వస్తదని ఎన్నిసార్లు అప్లికేషన్​ పెట్టుకున్నా.. ఇస్తలేరు.       -లక్ష్మి, జనగాం జిల్లా
 

నాలుగుసార్లు అప్లికేషన్..
నా భర్త మూడేండ్ల కింద చనిపోయాడు. వితంతువు పెన్షన్ కోసం నాలుగు సార్లు అప్లికేషన్లు పెట్టుకున్న. ఇప్పటి వరకు మంజూరు కాలేదు. ఇద్దరు పిల్లలతో పాటు మామను పోషించడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్న. ప్రభుత్వం స్పందించి పెన్షన్​ ఇప్పిస్తే కొంత బాధ తీరుతుంది.- సరిత, కట్టంగూర్, నల్గొండ జిల్లా

మరిన్ని వార్తల కోసం:

అవన్నీ రూమర్స్.. నా పెళ్లికి ఇంకా టైమ్ ఉంది

ఆకట్టుకుంటున్న శంకరుడి సైకత శిల్పం

నీళ్లు, బువ్వ లేకుండా 12 గంటలుగా క్యూలోనే ఉన్నం